భర్త ‘గే’.. నిజం తెలిసిన భార్య ఏం చేసిందంటే?

Sat Sep 19 2020 06:00:06 GMT+0530 (IST)

Husband 'gay' .. What did the wife who knew the truth do?

ఎన్నో ఆశలతో ఆమె సంసారంలోకి అడుగుపెట్టింది. మొదటి ఏడాది ఆ వ్యక్తి భార్యను బాగానే చూసుకున్నాడు. కానీ తర్వాతే అసలు విషయం భార్యకు అర్థమైంది. భర్త మగాళ్లతో తన లైంగిక వాంచలు తీర్చుకోవడం చూసి ఆ మహిళ షాక్ అయ్యింది. తన భర్త ‘గే’ అనే విషయం దాచి తనను మోసం చేశాడని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.గుజరాత్ లోని గాంధీనగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుడిపై విశ్వాసాన్ని ఉల్లంఘించాడనే కేసు దాఖలైంది. తను ‘గే’ అని బయటకు వెల్లడిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది.

అహ్మదాబాద్ లోని ఓ సంస్థలో బాధితురాలు లైబ్రేరియన్ గా పనిచేస్తోంది. 2011లో ప్రేమించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత పురుషులతో సన్నిహితంగా మెలుగుతూ వారితో కోరికలు తీర్చుకోవడం చూసి భర్తను నిలదీసింది.

తనకు స్త్రీల కంటే పురుషులపైనే ఆసక్తి అని.. తను గే అని .. సమాజం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పాడని బాధితురాలు తెలిపింది. పురుషులతో సంబంధం పెట్టుకోవడంతో తన భర్తను ఉద్యోగం లోంచి తీసివేశారని తెలిపింది. తన స్నేహితులను ఇంటికి పిలిపించుకొని మరీ లైంగిక వాంచలు తీర్చుకునేవాడని వాపోయింది. అత్తింటివారికి చెప్పినా పట్టించుకోలేదని విన్నవించింది. దీంతో పోలీసులను ఆశ్రయించినట్టు వివరించింది.