ప్రతీకారంతో 58 ఏళ్ల మహిళను రేప్ చేసి చంపేసిన మైనర్

Mon Feb 06 2023 10:09:29 GMT+0530 (India Standard Time)

A minor who raped and killed a 58-year-old woman in revenge

మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. కోపం ఉండొచ్చు. కానీ.. మరీ ఇంత కసిగా ప్రతీకారాన్ని తీర్చుకోవటమా? అది కూడా పదహారేళ్ల మైనర్ కుర్రాడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రెండేళ్ల క్రితం తనకు అవమానం జరిగిందన్న కోపాన్ని మనసులో పెట్టుకొని.. దారుణంగా హత్యాచారం చేసిన అతగాడిని  తీవ్రంగా శిక్షించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాకు చెందిన ఆ కుర్రాడి వయసు పద్నాలుగేళ్లు (రెండేళ్ల క్రితం మాట). తమ పక్కింటికి టీవీ చూసేందుకు వెళ్లేవాడు. ఆ ఇంట్లో పెద్ద వయస్కురాలైన మహిళ ఉండేవారు. అయితే.. టీవీ చూసి పోయే ఈ కుర్రాడి వ్యవహారం ఇలా ఉంటే.. ఒకరోజు ఇంట్లో మొబైల్ ఫోన్ కనిపించకపోవటంతో.. ఆ నేరాన్ని ఇంటికి టీవీ చూసేందుకు వచ్చే ఈ కుర్రాడి మీద పడింది. ఈ ఆరోపణలు ఆ కుర్రాడిని తెగ బాధించాయి. దాన్నో అవమానంగా భావించిన ఆ కుర్రాడు.. అమానవీయ ఘటనకు పాల్పడ్డాడు.

తాజాగా తాను గతంలో టీవీ చూసేందుకు వెళ్లిన ఇంటి యజమానురాలైన 58 ఏళ్ల మహిళపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్లిన అతను.. మంచంపై నిద్రపోతున్న ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

దీంతో.. ఆమె కేకలు వేసేందుకు ప్రయత్నించగా.. నోట్లో పాలిథిన్ కవర్తు.. గుడ్డలు కుక్కాడు. తాడుతో ముఖంపై ప్లాస్టిక్ కవరు కట్టేశాడు. అనంతరం.. ఆ ఇంట్లో నిర్మాణంలో ఉన్న భాగానికి తీసుకెళ్లి.. తలుపునకు కట్టేసి.. మళ్లీ దాడి చేశాడు. దీంతో.. ఆమె స్ప్రహ కోల్పోయారు. ఆనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అతను.

ఆ తర్వాత వేట కొడవలితో దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో ఉన్న వెయ్యి రూపాయిల నగదు.. నగలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పెద్ద వయస్కురాలైన మహిళను అత్యాచారం చేసి.. దారుణంగా చంపేసిన ఈ వైనం స్థానికంగా కలకలాన్ని రేపింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. కేసు నమోదు చేసుకున్నారు. తమదైన విచారణతో పక్కింటి మైనర్ బాలుడే ఈ దారుణానికి పాల్పడిన వైనాన్ని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా.. ప్రతీకారంలో భాగంగానే ఆ పని చేసినట్లుగా చెప్పిన వైనం నోట మాట రాని రీతగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.