Begin typing your search above and press return to search.
12 ఏళ్లకే తల్లియిన చిన్నారి బాలిక
By: Tupaki Desk | 28 May 2023 8:00 PMపంజాబ్ లో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని చిన్నారిని ఓ దుర్మార్గుడు కడుపు చేసి బిడ్డ కు జన్మనిచ్చేలా చేశాడు. అమృత్‌సర్ జిల్లా ఫగ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నెండేళ్ల బాలిక శనివారం ఓ చిన్నారి కి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినప్పటికీ.. ఆ విషయం ఆమె కు తెలియకపోవడం గమనార్హం. 12 ఏళ్ల వయసు అంటే.. అప్పుడే మెచ్యూరిటీ వయసు.. తల్లి అవసరం ఈ వయసులో అవసరం. ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవాల్సిన సమయంలో.. బాలిక ఏకంగా గర్భం దాల్చి తల్లయింది. బాలిక కడుపునొప్పి తో బాధపడుతూ గురునానక్ దేవ్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు.
12 ఏళ్ల ఆ బాలిక ఏడు నెలలుగా కడపు నొప్పితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు. తాత్కాలికంగా మందులు ఇచ్చి ఉపశమనం కలిగేలా చేశారు. ఆస్పత్రికి వచ్చే వరకూ ఆ చిన్నారి గర్భం దాల్చిందన్న విషయం గమనించకపోవడం విషాదకరం.
తీవ్రమైన కడుపు నొప్పి తో బాధపడుతున్న బాలికకు వైద్యులు ప్రసవం చేశారు. 800 గ్రాముల బరువున్న పాప ను బయటకు తీశారు. అయితే అవాంచిత గర్భం కారణంగా తల్లీ బిడ్డల పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇంట్లో తన కూతురు తాను మాత్రమే ఉంటున్నామని, తన భార్య వదిలేసి వెళ్లిపోయిందని బాలిక తండ్రి తెలిపాడు. ఎదిగే పాపను ఏమి అడగాలో, ఏమి అడగ కూడాదో తెయలేదని కన్నీరు పెట్టుకున్నాడు. తల్లి అందుబాటులో ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నాడు. తల్లి అన్నీ గమనించేందని, తను తన పనిచేసుకుంటూ బిడ్డ ను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
బాధితురాలిని దీని పై ప్రశ్నించగా.. ఏడు నెలల కిందట బహిర్భూమికి వెళ్లినపుడు తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. తన శరీరంలో మార్పులు వస్తున్నట్లు గుర్తించానని, కానీ గర్భం అని తెలియలేదని పేర్కొంది. అత్యాచారం గురించి తండ్రికి చెబితే ఏమౌతుందో అని చెప్పలేదని వెల్లడించింది. ఈవిషయమై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.