Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌.. తెలుస్తోందా నీ స‌త్తా.. ఈ మాట‌లు విన‌ప‌డ‌ట్లేదా...!

By:  Tupaki Desk   |   9 Dec 2022 11:30 PM GMT
ప‌వ‌న్‌.. తెలుస్తోందా నీ స‌త్తా.. ఈ మాట‌లు విన‌ప‌డ‌ట్లేదా...!
X
''జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేది ఏముంటుంది? ఆయ‌న అప్పుడ‌ప్పుడు రావ‌డం.. సంచ‌ల‌న కామెంట్లు చేయ‌డం.. రాష్ట్రంలో రాజ‌కీయ కాక పుట్టించ‌డం..ఆ వెంట‌నే సినిమాల్లోకి వెళ్లిపోవ‌డం.. ఇదీ. ఇత‌మిత్థంగా ఆయ‌న చేసే రాజ‌కీయం''-ఇటీవ‌ల ఒక సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌కీయాల‌కు త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కుడు చేసిన కామెంట్‌.

ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో కొన్ని కొన్ని విష‌యాలు విన్నా.. చూసినా ప‌వ‌న్‌ పై ప్ర‌జ‌ల‌కు.. నాయకుల‌ కు ఎంతటి ఆశ‌లు ఉన్నాయో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయ‌కులు.. ప‌వన్ త‌మ‌ను ప‌ట్టించుకున్నారా? లేదా? అనేవిష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. పార్టీ అండ‌తో ముందుకు సాగుతున్నారు. ఇక్క‌డ పార్టీ అండ అంటే కేవ‌లం జెండా అండ మాత్ర‌మే. గ‌త ఏడాది జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ఇదే క‌నిపించింది.

ప‌వ‌న్ ఎవ‌రిని ప‌ట్టించుకున్నా.. ప‌ట్టించుకోక‌పోయినా.. చాలా మంది స్వ‌తంత్రంగా మేం జ‌న‌సేన మ‌ద్ద‌తు దారులం.. అంటూ.. పంచాయ‌తీల్లో పోటీ చేశారు. కొంద‌రు గెలిచారు.

అనేక మందిని అస‌లు నామినేష‌న్‌ కూడా వేయ‌కుండా అడ్డుకున్నా.. క‌ల‌బ‌డి మ‌రీ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. కూడా వారితో ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా క‌లుసుకున్న‌ది లేదు. అయిన‌ప్ప‌టికీ వారు జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులుగానే ఉన్నారు.

తాజాగా ఉమ్మ‌డి కృష్ణాజి ల్లాకు చెందిన క‌లిదిండి మండ‌లం, కోరుక‌ల్లు గ్రామ‌ పంచాయ‌తీలో ఒక ఘ‌ట‌న జ‌రిగింది. ఇక్క‌డ నుంచి జ‌న‌సేన మ‌ద్ద‌తు దారుగా క‌న‌క‌దుర్గ అనే మ‌హిళ విజ‌యం సాధించారు. అయితే, ఆమెను వైసీపీ మ‌ద్ద‌తు దారుగా మారాలంటూ అధికార పార్టీ నేత‌ల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి వ‌స్తోంది. అయితే, ఆమె అలా చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెను ఏదో చిన్న‌కార‌ణం చూపిస్తూ స‌స్పెండ్ చేశారు.

దీని పై క‌న‌క దుర్గ హైకోర్టుకు వెళ్లి మ‌రీ స్టే తెచ్చుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. వేధింపులు మాత్రం ఆగ‌డం లేదు. దీని పై క‌న‌క‌దుర్గ ఏమ‌న్నారంటే.. త‌న వెను క ప‌వ‌న్ ఉన్నాడు. అన్నీ ఆయ‌నే చూసుకుంటారు. నేను మాత్రం జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుగానే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. చూసేందుకు ఒక్క క‌న‌క దుర్గ మాత్ర‌మే తెర‌మీదికి వ‌చ్చారు. కానీ, ఇలాంటి నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ప‌వ‌న్‌ను న‌మ్ముకున్నారు. మ‌రి ఇలాంటి వారి ఆవేద‌న‌, బాధ ప‌వ‌న్‌కు వినిపిస్తుందా? అనేదే ప్ర‌శ్న‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.