కీర్తి సురేష్ అనుకోని 40 లక్షలు ఇచ్చేశాడు.. బిగ్ షాక్!

Tue Dec 06 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

A girl cheated a man in the name of Keerthy Suresh

ఇంటర్నెట్ ప్రపంచంలో కొన్నిసార్లు జరిగే మోసాల గురించి వింటూ ఉంటే నవ్వాలో లేక జాలి పడాలో అర్థం కాదు. ఆ విధంగా కొంతమంది ఊహించిన విధంగా మోసపోతున్నారు. ఆన్ లైన్ మోసాల్లో ఎక్కువగా యువత మోసపోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మోసాలు చేసేవారిలో అమ్మాయిల సంఖ్య కూడా మరింత ఎక్కువ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల కీర్తి సురేష్ అంటూ ఒక అమ్మాయి ఒక వ్యక్తిని మోసం చేసిన విధానం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది.అతను కీర్తి సురేష్ అనుకోని ఏకంగా 40 లక్షల రూపాయల వరకు మోసపోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఉపయోగం ఎంత ఉందో అదే తరహాలో కొన్ని నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు వలలో పడి మోసపోతున్నారు కూడా. ఇక ఇటీవల కర్ణాటకలో 40 ఏళ్ల మహిళ కీర్తి సురేష్ తరహాలో ఫేస్ బూల్ లో ఒక వ్యక్తికి పరిచయమైంది.

ఇక ఆమె తనను తాను కీర్తి సురేష్ తరహాలో పరిచయం చేసుకొని ఆ తర్వాత కొన్ని ఫోటోలు కూడా పంపింది. ఆ వ్యక్తి కూడా ఆమెతో క్లోజ్ గా మారిపోయి కీర్తి సురేష్ తనతో చాటింగ్ చేస్తుంది అన్నట్లుగా సంతోషపడ్డాడు. అయితే కొన్నిసార్లు హఠాత్తుగా డబ్బులు అవసరం పడ్డాయని ఆ వ్యక్తిని అడుగుతూ వచ్చింది. ఇక సదరు యువకుడు కూడా నిజంగా కీర్తి సురేష్ అడుగుతుందేమో అనుకొని డబ్బులు ఇస్తూ వచ్చాడు.

ఆ సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతూ నలభై లక్షల వరకు వెళ్ళింది. ఇక చివరికి ఆమె నిజమైన కీర్తి సురేష్ కాదని తెలుసుకున్న ఆ యువకుడు వెంటనే పోలీసులను సంప్రదించాడు. ఇక ఎవరని ఆరా తీస్తే ఆమె కూడా కర్ణాటక చెందిన 40 ఏళ్ల మహిళా అనే తెలిసింది.

ఇక వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు ఇలాంటి మోసాల బారిన పడకూడదు అని వివరణ ఇచ్చారు. అలాగే ఏ మాత్రం బ్లాక్ మెయిల్ చేసిన కూడా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలి అని కూడా వారు వివరణ ఇచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.