Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రికి తప్పిన ఘోర ప్రమాదం

By:  Tupaki Desk   |   26 March 2023 1:15 PM GMT
ఏపీ మంత్రికి తప్పిన ఘోర ప్రమాదం
X
పారా మోటరింగ్.. అచ్చం హెలిక్యాప్టర్ లా ఉండే ఈ గాలివాహనంలో కూర్చొని గాలిలో ఎగిరిపోవచ్చు. అయితే సుశిక్షితులైన వారు నడిపితేనే వెళుతుంది. కానీ మన ఏపీ మంత్రి కాస్త సాహసం చేయబోయాడు. అదే వికటించి. ఆయనకే ముప్పు తెచ్చిపెట్టింది. విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోవడం కలకలం రేపింది.

విశాఖలో G20 సదస్సులో నిర్వహించిన రన్ పోటీలు అనంతరం నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు మంత్రి బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్.

అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురై ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది జాగ్రత్తగా పట్టుకుని దించారు. ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు.

G20 సదస్సులో భాగంగా విశాఖ నగరంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం బీచ్ రోడ్ లో 3 కే, 5 కే, 10 కే రన్ పోటీలను నిర్వహించారు. అనంతరం పారాగ్లైడింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పారాగ్లైడింగ్ ను మంత్రులు ప్రారంభించగా, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పారాగ్లైడింగ్
చేసేందుకు సిద్ధమై ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ఈనెల 28 నుంచి విశాఖలో జీ20 సన్నాహాక సదస్సు ఏర్పాట్లు పర్యవేక్షణకు ఏపీ మంత్రులు రజినీ, సురేష్, అమర్ నాథ్ వచ్చారు. జీ20 సదస్సుకు సీఎం జగన్ హాజరు కాబోతున్నారు. మూడు రోజుల పాటు దేశ, విదేశీ ప్రతినిధులు విశాఖ రాబోతున్నారు. వారి ఏర్పాట్ల కోసం వచ్చి మంత్రి ఇలా ప్రమాదం బారినపడ్డాడు.