టోయ్స్ లెక్కన టోకుగా ఖరీదైన కార్లు అమ్మేస్తున్న క్రికెటర్

Thu Mar 30 2023 09:22:31 GMT+0530 (India Standard Time)

A cricketer who sells expensive cars wholesale on the basis of toys

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహా చాలా మంది భారత క్రికెటర్లు ఆటోమొబైల్ ఔత్సాహికులు. ఖరీదై న కార్లు బైక్ లు కొని గ్యారేజీలు నింపడం వీళ్లకు హాబీ. కానీ వారి బిజీ సంచార షెడ్యూళ్ల కారణంగా తరచుగా కార్ - బైక్ రైడ్ లను ఆస్వాధించే అవకాశం ఉండదు. కుటుంబంతో ఎక్కువ సమయం ఒకే చోట గడిపే వీలుండదు. కొన్నేళ్లు గా టీమిండియా మాజీ రథసారథి కోహ్లీ అదే ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కారణం ఏదైనా అతడు తన ఖరీదైన కార్లన్నిటి నీ ఒక్కొక్కటి గా అమ్మేస్తున్నాడు. కార్ ఫర్ సేల్ అంటూ అతడు వీటన్నిటి నీ టోయ్స్ లెక్కన టోకు గా అమ్మేస్తుండడంతో అది అభిమానులను ఆశ్చర్యాని కి గురి చేస్తోంది.



రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన కార్లలో మెజారిటీ కార్లను  ఎంతో ఎగ్జయిటింగ్ గా కొనుక్కున్నానని కానీ వాటిని ఇలా విక్రయించడం బాధ కలిగిస్తోందని కూడా చెబుతున్నాడు. ఆర్.సి.బి బోల్డ్ డైరీస్ లో కోహ్లి మాట్లాడుతూ కార్లను కొనుగోలు చేయడం .. వాటిని తన గ్యారేజీలో అదనం గా జోడించడం అర్ధం లేని ప్రయత్నం అని గ్రహించానని తెలిపాడు. నా దగ్గర చాలా కార్లు హఠాత్తు గా కొనుగోలు చేసినవే. నేను డ్రైవింగ్ చేయడం లేదా వాటిలో ప్రయాణించడం కూడా కష్టంగా మారింది అని కోహ్లీ చెప్పాడు. ఒక పాయింట్ కు మించి ఆలోచిస్తే ఇది అర్ధంలేనిది అని నేను భావించాను. కాబట్టి నేను వాటిలో చాలా వరకు అమ్మేశాను. ఇప్పుడు ఖచ్చితంగా అవసరమైన కార్లను మాత్రమే ఉపయోగిస్తాను.. అని తెలిపాడు.

పరిణతితో ఎదగడం జీవితం పై మరింత అవగాహన కలగడంలో ఇది ఒక భాగమని నేను భావిస్తున్నాను! అని కోహ్లీ తెలిపారు. 'మీకు బొమ్మలు' సొంతం కావాలని అనిపించదు... ఇది ఆచరణాత్మకం గా ఉంటుంది!! అని కూడా కోహ్లీ నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. మునుపటి ఇంటరాక్షన్ లో కోహ్లి తన మొదటి కారు టాటా సఫారీ ని 2008లో కొనుగోలు చేసానని వెల్లడించాడు. ఆ సమయంలో SUV ల పట్ల తనకున్న ప్రేమను దాచుకోలేదు. ఆ కార్ లో పూర్తి స్థాయి మ్యూజిక్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. ఆ సమయంలో అది ఢిల్లీలో ఒక ట్రెండ్.

2020లో కోహ్లీ మొదటి ఆడి కారు- R8 మోడల్ కొనుగోలు చేసాడు. ఢిల్లీలో ని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇది పడి ఉంది. అతను గతంలో ఆడి ఇండియా కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. 2016లో దానిని అప్ గ్రేడ్ చేయడాని కి విక్రయించే ముందు 2012 మోడల్ ను కొనుగోలు చేశాడు. అయితే కోహ్లి తన కారును విక్రయించిన వ్యక్తి సాగర్ ఠక్కర్ కొన్ని ఆర్థిక కుంభకోణాని కి పాల్పడడంతో పోలీసులు వాహనాన్ని(ఆడి కారు- R8) సీజ్ చేశారు.

RCB 2022లో సాపేక్షం గా విజయవంతంగా బండి నడిచింది. మొత్తం మీద టీమ్ మూడవ స్థానంలో నిలిచింది.ఇది విరాట్ కోహ్లీ కి కలిసిరాని టోర్నమెంట్. ఏస్ బ్యాటర్ అగ్రస్థానంలో లేదా కనీసం మూడో స్థానంలో కూడా లేడు. ఆ తర్వాత కూడా అతని పతనావస్థ కొనసాగింది. 2023లో ఇప్పటి వరకు తన ఫామ్ ను తిరిగి పుంజుకు ని  అన్ని ఫార్మాట్లలో సవ్యంగా పరుగులు చేసిన కోహ్లీ.. ఐపీఎల్ 2023లో RCB తరపున ఆడేందుకు చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. టోర్నీ కి ముందు RCB సోషల్ మీడియా హ్యాండిల్స్ విడుదల చేసిన వీడియోలో మాజీ కెప్టెన్ కోహ్లీ ఆటకు ముందు తన ఎగ్జయిట్ మెంట్ ని ప్రదర్శించాడు. నేను ఆడాలనుకున్న స్థాయికి చేరుకోగలిగితే జట్టుకు సహాయం చేయగలిగితే ఐపీఎల్ లో నా అత్యుత్తమ స్థాయి కి చేరుకోవడాని కి ఇంకా స్కోప్ ఉందని ఆశాభావం వ్యక్తం చేసాడు. సీజన్ ప్రారంభాని కి ముందు కోహ్లీ ఇటీవలే జట్టు ప్రాక్టీస్ శిబిరంలో చేరాడు. అతను RCB అన్ బాక్స్ ఈవెంట్ కు ముందు సహచరులతో పాటు మొదటి పూర్తి శిక్షణా సెషన్ లో పాల్గొన్నాడు. ఐపీఎల్ 2023లో కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడు? అంటూ అభిమానుల్లో చాలా ముందే బెట్టింగులు నడుస్తుండడం ఆశ్చర్యకరం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.