సంక్రాంతి వేళ గుడివాడలో 'గోవా' దుకాణం పెట్టేశారుగా

Sun Jan 16 2022 14:58:09 GMT+0530 (India Standard Time)

A 'Goa' shop was set up in Gudivada during Sankranti

కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ చిట్టి వీడియోలు చూసినోళ్లంతా నోరెళ్ల బెడుతున్నారు. సంక్రాంతి పండక్కి చేపట్టిన ఈ ‘గోవా’ దుకాణం షాకింగ్ గా మారింది. ట్రెండ్ కు తగ్గట్లు సెట్టింగ్ చేసిన నిర్వాహకుల తెలివికి ఫిదా అవుతున్నారు. మరి..చట్టం ఏం చేస్తుందనే ప్రశ్నకు మాత్రం సమాధానం లభించటం లేదన్న మాట వినిపిస్తోంది. క్రిష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో జరిగిన ఈ రచ్చరంబోలా ప్రోగ్రాం వివరాల్లోకి వెళితే.. నోటి వెంట మాట రాని పరిస్థితి.సంక్రాంతి అన్నంతనే.. ఏపీలోని కోస్తా ప్రాంతంలో జరిగే వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంటాయి. సంప్రదాయబద్ధంగా నిర్వహించే కోడి పందాలు.. ఎడ్ల బండ్లపోటీలు లాంటివాటితో పాటు.. ఊరి చివర్లోని తోపుల్లో పేకాట శిబిరాలు భారీగా నిర్వహిస్తుంటాయి. పోలీసులకు కళ్లు గప్పి కొన్ని.. పోలీసుల్లోని కొందరితో లాలూచీ పడి మరికొందరు తమకు తోచినట్లుగా ప్లానింగ్ చేస్తుంటారు.

అందుకు భిన్నంగా గుడివాడ పట్టణంలో ఫేమస్ అయిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో సంక్రాంతి సందర్భంగా గోవాను తలపించేలా భారీ సంక్రాంతి సెట్టింగ్ పెట్టేశారు. రంగురంగుల లైట్లలో.. ఓపక్క డీజే.. మరోపక్క రికార్డింగ్ డ్యాన్సులు.. మరోవైపు పేకాట టేబుల్స్ ఏర్పాటు చేసి.. గోవా క్యాసినోలు చిన్నబోయేలా ఏర్పాట్లు చేశారు. ఇంత ఓపెన్ గా జరుగుతున్న ఈ ‘గోవా’ మార్కు సంబరాల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు బయటకు వచ్చి షాకింగ్ గా మారాయి. వైరల్ గా మారిన ఈ కన్వెన్షన్ సెంటర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.