13ఏళ్ల కుర్రాడిపై 24 ఏళ్ల యువతి అత్యాచారం

Wed Aug 12 2020 09:15:56 GMT+0530 (IST)

A 24 year old woman Forced 13 year old boy

13 ఏళ్ల మైనర్ బాలుడు.. ఇంకా శృంగారం గురించి అవగాహన లేని పిల్లాడు. వర్జిన్ అని ఓ 24 ఏళ్ల యువతి ఆశపడింది. మెల్లిగా తన మాయమాటలతో ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆ కుర్రాడు భయపడుతూనే ఆమె ఇంటికి వెళ్లాడు. అతడిపై బలవంతంగా లైంగిక దాడి చేసింది. అమెరికాలో ఈ దారుణం జరిగింది.టెక్సాస్ కు చెందిన జోయా అనే యువతి స్థానికంగా ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. కాగా అదే ప్రాంతంలో ఉండే 13 ఏళ్ల మైనర్ బాలుడిపై ఆమె కన్నేసింది. ఈ క్రమంలో మాయమాటలతో ఇంటికి రమ్మని వచ్చాక బలవంతంగా అత్యాచారం చేసింది. ఆ తర్వాత బయటకు చెబితే మీ తల్లిదండ్రులకు నువ్వే రేప్ చేశావని చెప్తానని బెదిరించింది. దీంతో కుర్రాడు వణికిపోయి ఆమెతో ఆ రాసలీలలు చేస్తూ వచ్చాడు.

జోయా తతంగాన్ని గమనించిన కుర్రాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

అయితే తనకు జైపోలార్ డిజార్డర్ ఉందని.. కోర్టులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి జైలు నుంచి తప్పించుకునే యత్నం చేసింది. ఆమెను ఇంటిలోనే ఉండాలని కోర్టు సూచించగా.. పోలీసులు ఇంటి నిర్బంధం చేశారు. ఇంటి నుంచి పారిపోయిన జోయను పట్టుకొని కోర్టులో హాజరు పరుచగా.. ఆమె నాటకం ఆడిందని తెలుసకొని 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు.