Begin typing your search above and press return to search.

21 ఏళ్లకే హైకోర్టు జడ్జి... ఎలా సాధ్యమైందంటే ?

By:  Tupaki Desk   |   21 Nov 2019 12:30 PM GMT
21 ఏళ్లకే హైకోర్టు జడ్జి... ఎలా సాధ్యమైందంటే ?
X
సాధారణంగా 21 ఏళ్ల యువకులు జాబ్స్ కోసం బుక్స్ తో కుస్తీ పడుతుంటారు. కానీ , రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని ఒక యువకుడు 21 ఏళ్లకే హై కోర్ట్ జడ్జ్ గా ఎంపికై , ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. ఆ యువకుడి పేరు ప్రతాప్ సింగ్. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని మానస సరోవర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దేశంలోనే యంగెస్ట్ జడ్జిగా రికార్డ్ సృష్టించారు. మయాంక్ ప్రతాప్ సింగ్ రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైయ్యారు. ఎంతో అనుభవం ఉన్నవారే ఎంపిక అయ్యే ఈ పోస్టుకు మయాంక్ కేవలం ఒకేసారి పరీక్ష రాసి ఎంపిక కావడం విశేషం.

మయాంక్.. రాజస్థాన్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. ఈ ఏడాది ఏప్రిల్ లోనే తన అయిదేళ్ల ఎల్ఎల్బీని పూర్తి చేశారు. ఆ వెంటనే రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలను రాశారు. తొలి ప్రయత్నంలోనే జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంక్ సాధించి హై కోర్ట్ జడ్జ్ గా నియమితులైయ్యారు. రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు గతంలో కనీస వయస్సు 23 సంవత్సరాలు ఉండేది. కానీ అందులో మార్పులు చేసి 21 ఏళ్లకు కుదించారు. దీనితో మయాంక్‌కు ఈ అరుదైన అవకాశం దక్కింది.

చిన్న వయస్సుల్లోనే హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడంపై పలువురు ప్రశంసిస్తున్నారు. దీనిపై మయాంక్ మాట్లాడుతూ .. న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించేందుకు తాను ప్రతిరోజూ కనీసం 12 నుంచి 13 గంటలు ప్రాక్టీస్ చేసినట్టు మయాంక్ చెబుతున్నారు. తన బాధ్యతలు మంచిగా నిర్వర్తించడమే తన ముందు ఉన్న లక్ష్యమని తెలిపాడు.