Begin typing your search above and press return to search.

99% కేసులు పూర్తిగా హానిచేయనివే: డోనాల్డ్ ట్రంప్

By:  Tupaki Desk   |   6 July 2020 6:45 AM GMT
99% కేసులు పూర్తిగా హానిచేయనివే: డోనాల్డ్ ట్రంప్
X
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో 99% కరోనా కేసులు పూర్తిగా ప్రమాదకరం కావని ట్రంప్ ఆధారాలతో సహా పేర్కొన్నారు. కరోనాపై దాదాపు 40 మిలియన్ల మంది పై పరీక్షలు చేశామని.. 99% మందికి ఇది పూర్తి గా ప్రమాదకరం కాదని ఆయన చెప్పారు.మేము సంవత్సరానికి చికిత్సా లేదా టీకా పరిష్కారం కనుగొంటామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నం గా అమెరికా లో పరిస్థితి ఉంది. చాలా రాష్ట్రాల్లో కొత్త కేసుల లో రికార్డులు బద్దలు కొడుతున్నాయి. టెక్సాస్‌ రాష్ట్రం లో 7,890 మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు. ఫ్లోరిడా లో 11,445 కేసులు నమోదయ్యాయి.

ఇన్నాళ్లు అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో మహమ్మారి వ్యాప్తికి చైనానే కారణమని నిందలు వేశారు. చైనాను పూర్తిగా జవాబుదారీగా ఉంచాలన్నారు. కరోనా విషయంలో చైనా ప్రపంచానికి తప్పుగా నివేదించిందని.. తప్పు దోవ పట్టించిందని నిందించారు. అదే సమయం లో అమెరికా లో అధిక సంఖ్య లో కేసులు ఎక్కువ పరీక్షల వల్ల నమోదవుతున్నాయని పేర్కొన్నారు.

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి చైనా కుట్రపన్నిందని.. రహస్యంగా ఉంచి వంచన చేసిందని ట్రంప్ ఆరోపించారు. చైనా పూర్తిగా జవాబు దారీగా చేయాలని ట్రంప్ అన్నారు. మహమ్మారి కి వ్యతిరేకం గా దేశం “పురోగతి సాధించిందన్నారు. వెంటిలేటర్లకు తయారీలో రికార్డు సృష్టించామని.. ప్రపంచంలో ఎక్కడైనా మాకు అత్యుత్తమమైన ఉత్తమమైన పరీక్ష వ్యవస్థ ఉందని తెలిపారు. మన దేశంలోనే సొంతంగా పీపీఈ కిట్స్.. మాస్కులు శస్త్రచికిత్సా పరికరాలను ఉత్పత్తి చేస్తున్నామని ట్రంప్ తెలిపారు.