Begin typing your search above and press return to search.
అమెరికాలో ఆ వీసాలో మన ఆడవాళ్లదే రికార్డ్
By: Tupaki Desk | 12 May 2018 1:07 PM ISTఅమెరికాలో మనోళ్ల సత్తా ఖాతాలో మరో రికార్డ్ నమోదయింది. ఇప్పటికే ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికాలోని కంపెనీలకు వీలు కల్పించేవి హెచ్–1బీ వీసాలు అనే సంగతి తెలిసిందే. ఈ వీసాలు పొందడంలో భారతీయులే టాప్‌లో ఉన్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 74.2 శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులే దక్కించుకున్నారు. 2017లో ఈ సంఖ్య మరింత పెరిగి 75.6 శాతానికి చేరుకుంది. మరోవైపు చైనా 2016 - 2017 సంవత్సరాల్లో వరుసగా 9.3 - 9.4 శాతం వీసాలు మాత్రమే దక్కించుకుని భారత్ తర్వాత సుదూరాన నిలిచినప్పటికీ రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈ వివరాలను అమెరికా పౌరసత్వ - వలససేవల సంస్థ (యూఎస్ సీఐఎస్) నివేదిక వెల్లడించింది. ఇదిలాఉండగా మరో రికార్డ్ మనోళ్లు పైగా, భారతీయ మహిళలు టాప్ లో ఉండటం గమనార్హం.
అమెరికాలో హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్–4 వీసాలను మంజూరు చేస్తారని విషయం ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతులిచ్చారు. ప్రస్తుతం 65 వేల మందికి పైగా భారతీయులు హెచ్–4 వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికాలో హెచ్–4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు (వర్క్ పర్మిట్స్) రద్దు చేయాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించడం - దానిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుండటం తెలిసిన విషయమే. అయితే ఈ నిర్ణయం వల్ల భారీగా నష్టపోయేది మన భారతీయ మహిళలే అని ఎందుకంటే...మన దేశానికి చెందిన మహిళలు సృష్టించిన రికార్డ్ అది.
అమెరికా కాంగ్రెస్‌కు చెందిన కాంగ్రెస్సనల్ రీసెర్స్ సర్వీసెస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మొత్తం వీసాల్లో 93శాతం భారతీయులవే. ఐదు శాతం మన పొరుగు దేశమైన చైనావి. మనదేశానికి చెందిన 93%లో మెజార్టీ మహిళలవే కావడం విశేషం. ఇక మొత్తం 94% వీసాదారుల్లో 5వంతు కాలిఫోర్నియాలోనే నివసిస్తున్నారు. 28033 మంది భారతీయులు ఇక్కడ ఉండగా ఆ తదుపరి స్థానాల్లో టెక్సాస్, న్యూజెర్సీ ఉన్నాయి. హెచ్4 కేటగిరీ కింద మొత్తం 1,26,853 వీసాలకు యూఎస్ సిటిజన్‌షిప్ ఆండ్ ఇమ్మిగ్రేషన్ ఆమోదం తెలిపింది.
ఇదిలాఉండగా...హెచ్4వీసాల రద్దుకు ట్రంప్ సిద్ధమవడంపై అమెరికా కంపెనీలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. `హెచ్–4 వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిలో కనీసం 80 శాతం మంది మహిళలే. వారంతా వారివారి స్వదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు కూడా చేసి పెళ్లి అయ్యాక వారి జీవిత భాగస్వామితో కలసి ఉండేందుకు అమెరికా వచ్చారు. వారు ఇక్కడ పనిచేసి, వేతనాలు తీసుకొని మన ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. మరికొంత మంది డబ్బు సంపాదించాక వ్యాపారాలు పెట్టి అమెరికా ప్రజలకు కూడా ఉద్యోగాలిస్తున్నారు. ఇప్పుడు హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దుచేస్తే కొంతమంది అమెరికన్ల ఉపాధికీ ప్రమాదమే’ అని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ పేర్కొంది.