Begin typing your search above and press return to search.
మేం చస్తాం..సర్కారుకు రైతుల లేఖ
By: Tupaki Desk | 27 March 2018 12:30 AM ISTఇటీవల లాంగ్ మార్చ్ నిర్వహించి దేశం చూపును తనవైపు తిప్పుకొన్న మహారాష్ట్ర రైతులు మరో సంచలన వార్తతో తెరమీదకు వచ్చింది. ఈనెల 11 చిన్నగా మొదలై మహోగ్రరూపం సంతరించుకుంటున్న మహారాష్ట్ర రైతు పాదయాత్ర అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన సంగతి తెలిసిందే. నాసిక్‌లో మొదలైన పాదయాత్ర ముంబైకి చేరుకుంది. పుడమి తల్లిని నమ్ముకుని కండలు కరిగించే అన్నదాతలు 180 కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా పూర్తిచేశారు. అసెంబ్లీని ముట్టడిస్తామని నిరసన ప్రదర్శనకు సిద్ధమైన రైతులు ప్రకటించారు. ఈ సమయంలోనే ప్రభుత్వం రంగంలోకి వచ్చి పరిష్కారానికి కృషి చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మరో వార్తకు మహారాష్ట్ర రైతులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కష్టాలు తీర్చలేదని, ఇక తమకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ను రైతులు కోరారు. ఈ మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావుకు బుల్దానా ప్రాంతానికి చెందిన రైతులు 91 మంది సంతకాలతో కూడిన లేఖను రాశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం తమ భూములను సేకరించిందని, ఆ భూములకు తగిన పరిహారాన్ని సక్రమంగా అందజేయడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు రైతుల సమస్యలు పరిష్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.