Begin typing your search above and press return to search.

భారీ ఎన్‌కౌంటర్ ..24 గంటల్లో 9 మంది ఉగ్రవాదుల హతం !

By:  Tupaki Desk   |   8 Jun 2020 12:20 PM IST
భారీ ఎన్‌కౌంటర్ ..24 గంటల్లో 9 మంది ఉగ్రవాదుల హతం !
X
ప్రపంచం మొత్తం మహమ్మారి భారిన పడి , ఎలా బయట పడాలో తెలియక నానా అవస్థలు పడుతున్న సమయంలో కూడా పాక్ తన వికృత చేష్టలు ఆపడంలేదు. జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా జమ్మూ కాశ్మీర్‌ లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఘర్షణ జరగగా షోపియన్‌ లోని పింజోరా ప్రాంతంలో ఎన్‌ కౌంటర్ చోటుచేసుకుంది.

భద్రతాదళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం మేర సోమవారం షోపియాన్ పోలీసులు సైనికులతో కలిసి గాలింపు చేపట్టారు. సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. పోలీసులు, భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనిక జవాన్లు కూడా గాయపడ్డారు. పింజోరాకు 12 కిలోమీటర్ల దూరంలోని రెబన్ గ్రామంలో ఆదివారం (7 , జూన్ ) జరిగిన ఎన్‌ కౌంటర్ ‌లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ సుమారు 12 గంటలపాటు కొనసాగిందని అధికారులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్ ‌లో ఉగ్రవాదులు చొరబాటుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.