Begin typing your search above and press return to search.
ఏమిటీ కంబళ.. ఇప్పుడు ఎందుకింత హాట్ టాపిక్
By: Tupaki Desk | 16 Feb 2020 9:00 AM ISTకొన్నిసార్లు అంతే. ఎంతో కాలంగా మనతో ఉన్నా.. లభించని పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా వచ్చేస్తాయి. తాజాగా కంబళ విషయంలో జరిగింది కూడా ఇదే. కర్ణాటకలోని మంగళూరు.. ఉడుపి ప్రాంతాల్లో కంబళ పేరుతో సంప్రదాయబద్ధమైన పోటీని నిర్వహిస్తుంటారు. ఈ పోటీలో బురద మళ్లలో పోటీదారులు.. తమ దున్నపోతులతో కలిసి పరుగులు తీయాల్సి ఉంటుంది.
ఈ సంప్రదాయ క్రీడ పట్ల కన్నడిగులు చాలా ఆసక్తిని చూపుతుంటారు. కంబళలో అభ్యంతరకరమైన అంశం ఏమైనా ఉందంటే.. పోటీలో పాల్గొనే దున్నలను మరింత వేగంగా పరిగెత్తటం కోసం కొరడాతో బలంగా కొడుతుంటారు. దీనిపై జంతుప్రేమికులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంటారు. మనిషి ఆనందం కోసం మూగజీవాల్ని అంతలా హింసించాలా? అని ప్రశ్నిస్తుంటారు.
వాస్తవానికి కొన్నేళ్ల క్రితం జంతుప్రేమికుల అభ్యర్థనలతో కంబళనను నిషేధం విధించారు. అయితే.. కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక కంబళపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేశారు. దీంతో.. ఈ పోటీల్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ క్రీడ మీద ఎందుకింత ఆసక్తి వ్యక్తమవుతోంది? సోషల్ మీడియాలో దీని మీద ప్రత్యేక చర్చ ఎందుకు జరుగుతుందంటే.. కారణం లేకపోలేదు.
తాజాగా నిర్వహించిన కంబళ పోటీ లో ఒక యువకుడు ఊసేన్ బోల్డ్ కంటే వేగంగా పరిగెత్తిన వైనం రికార్డు అయ్యింది. బోల్డ్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును బద్ధలయ్యేలా అతని పరుగు ఉండటంతో.. కంబళ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఊసేన్ బోల్ట్ పరుగు ను.. కబంళ లో పరిగెత్తిన శ్రీనివాస గౌడ్ ను ఒకేలా పోల్చటం సరికాదంటున్నారు. ఎందుకంటే.. ఈ రేస్ లో దున్నపోతులు వేగంగా పరిగెత్తటం రన్నర్లకు లాభిస్తుందని చెబుతున్నారు. అయితే.. ఫ్లాట్ పిచ్ మీద పరిగెత్తే దానికి బదులుగా.. పొలాల్లోని బురద మళ్ల లో పరిగెత్తటం ఒకటి కాదని చెబుతున్నారు. ఏమైనా.. ఇప్పటివరకు ప్రపంచ రికార్డు గా ఉన్న పరుగును బీట్ చేసిన వైనం ఇప్పుడీ క్రీడ పై కొత్త చర్చకు కారణమైందని చెప్పక తప్పదు.