Begin typing your search above and press return to search.

దారుణం : 9 మంది ఐక్యరాజ్య సమితి అధికారులకు కరోనా

By:  Tupaki Desk   |   1 April 2020 3:00 PM GMT
దారుణం : 9 మంది ఐక్యరాజ్య సమితి అధికారులకు కరోనా
X
వారిని వీరిని అనే తేడా లేకుండా ప్రపంచ దేశాల్లో అందరిని కూడా కరోనా వైరస్‌ ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా వైరస్‌ కారణంగా పలు ప్రపంచ దేశాలు లాక్‌ డౌన్‌ ను అమలు చేస్తున్నా ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి అధికారులు అన్ని దేశాలకు సంబంధించిన విషయాలను సేకరించడం.. అవసరం అయిన సాయంను అందించడం చేస్తున్నారు. ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి చాలా కీలకంగా వ్యవహరిస్తుందని ఇటీవలే అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి కథనంను రాయడం జరిగింది.

ఇంతలోనే జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయ ఉద్యోగులకు 9 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందట. ఈ విషయంను ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన అలెసాండ్రా వెలుసి తెలియజేశారు. ప్రస్తుతం వారి వివరాలను వెళ్లడి చేయలేం. కాని వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. వారు త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

ప్రపంచం విపత్తులో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన ఐక్యరాజ్య సమితి అధికారులే ఇప్పుడు విపత్తుకు బలి అవుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరింతగా ఆందళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విపత్తు నుండి కాపాడే వారే లేరా అంటూ ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలను గడగలడలాడిచ్చిన పెద్దన్న అమెరికాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా రెండు లక్షలకు చేరడం ఆందోళన కలిగిస్తుంది. ఎంతో అభివృద్ది చెందిన అమెరికాలో పరిస్థితి అలా ఉంటే ఇతర దేశాల పరిస్థితి ఏంటీ అంటూ రాబోయే రోజులను తల్చుకుంటూ జనాలు భయాందోళనకు గురవుతున్నారు.