Begin typing your search above and press return to search.

అల్ ఖైదా ఉగ్రవాదులకు 24వరకు ట్రాన్సిట్ రిమాండ్

By:  Tupaki Desk   |   20 Sep 2020 12:10 PM GMT
అల్ ఖైదా ఉగ్రవాదులకు 24వరకు ట్రాన్సిట్ రిమాండ్
X
ఇటీవలే కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 9మంది అల్ ఖైదా ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. అల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ గుర్తించి అరెస్ట్ చేసింది.

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్, కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరాల్లో ఎన్ఐఏ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు చేశారు. అల్ ఖైదా ఉగ్రసంస్థతో సంబంధాలున్న 9మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నిషేధిత అల్ ఖైదా ఉగ్రసంస్థకు చెందిన 9 మంది ఉగ్రవాదులు ముర్షిదాబాద్ ఎర్నాకుళం కేంద్రాలుగా పనిచేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, జిహాది సాహిత్యం, ఆయుధాలు, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ తెలిపింది.

ఢిల్లీ, ఎన్సీఆర్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. ముర్సిదాబాద్ లో ఆరుగురు, ఎర్నాకుళంలో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశానికి చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

ఈ ఆరుగురిని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో హాజరుపరుచగా.. వారికి ఈనెల 24 వరకు ట్రాన్సిట్ రిమాండ్ ను కోర్టు విధించింది. ఆలోగా వీరిని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుందని దర్యాప్తు సంస్థ లాయర్ శ్యామూల్ ఘోష్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడాలన్న కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసిందని ఆయన తెలిపారు.