Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కి రూ. 89.55 కోట్ల విరాళాలు .. వైసీపీ కి ఎన్ని కోట్లంటే ?

By:  Tupaki Desk   |   12 Jun 2021 4:00 PM IST
టీఆర్ఎస్ కి రూ. 89.55 కోట్ల విరాళాలు .. వైసీపీ కి ఎన్ని కోట్లంటే ?
X
ఏపీలో వైసీపీ , తెలంగాణలో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి అవినాభావ సంబంధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఇద్దరు ముఖ్యమంత్రులు పాలన కొనసాగిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో రెండు రాష్ట్రాలు ప్రత్యేకంగా ఏర్పడినప్పటికీ ఒకే రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి. కానీ, ఒక విషయంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి మొదటి ప్లేస్ లో నిలిచింది.

ఇంతకీ ఎందులో టిఆర్ఎస్ పార్టీ , వైసీపీ పార్టీ ని వెనక్కి నెట్టింది అని ఆలోచిస్తున్నారా... అది ఏ విషయంలో అంటే విరాళాల విషయంలో. విరాళాల విషయంలో టిఆర్ఎస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది. ఇంతకీ ఈ మూడు పార్టీలు ఎంత మొత్తంలో విరాళాలు సేకరించి మొదటి స్థానాల్లో నిలిచాయి అంటే... 2019-20 సంవత్సరానికి గాను దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో టిఆర్ ఎస్ పార్టీకి ఎక్కువ మొత్తంలో విరాళాలు వచ్చాయి. టీఆర్ ఎస్ పార్టీ రూ. 89.55 కోట్ల విరాళాలను పొందింది. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ. 8.92 కోట్ల ను విరాళంగా పొందింది. ఇక టీడీపీ కి రూ. 2.60 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇక AIMIM రూ. 13.85 లక్షలని విరాళంగా పొందింది.