Begin typing your search above and press return to search.

ఈ డాక్టర్​ తాతయ్య నిజంగా దేవుడే.. యువ వైద్యులకు పాఠమే!

By:  Tupaki Desk   |   25 Oct 2020 5:00 AM IST
ఈ డాక్టర్​ తాతయ్య నిజంగా దేవుడే..  యువ వైద్యులకు పాఠమే!
X
ఈ రోజుల్లో వైద్యం అంటే ఓ దందా.. టెస్టులు, డాక్టరు ఫీజులు, నర్సింగ్​ ఫీజులు అంటూ లక్షల రూపాయలు దోచుకుంటూ పేదలను దోచుకుంటున్నారు. వైద్యరంగంలోకి పారిశ్రామిక వేత్తలు వచ్చాక ఈ వృత్తిని ఓ లాభసాటి బేరంగా చేసేశారు. సర్కార్​ ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. పరోక్షంగా కార్పొరేట్​ హాస్పిటళ్ళకు రెడ్​కార్పెట్​ పరుచుతున్నారు. ఇటు సర్కార్​ ఆస్పత్రులకు వెళ్లలేక.. కార్పొరేట్​ ఆస్పత్రులకు లక్షల రూపాయల ఫీజులు కట్టలేక మధ్య తరగతి ప్రజలు ఉన్న ఆస్తులను సైతం తెగ నమ్ముకుంటున్న రోజులివి..

విద్యను వ్యాపారాన్ని కార్పోరేట్​ చేసిన ప్రస్తుత రోజుల్లో అప్పుడప్పుడు కాంతి రేఖల్లాంటి వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే డాక్టర్​ రామచంద్ర దండేకర్​.. ఆయన వయసు ప్రస్తుతం 87 ఏళ్లు. ఈ వయసు లో కూడా ఫోన్​ చేసిన వెంటనే పేద ప్రజల గుడిసె ల్లోకి ఇరుకు ఇళ్ల ల్లోకి ఆయన వెళ్లి ఉచితం గా వైద్యం చేస్తుంటారు. వారికి అవసరమైన మందులు కూడా ఫ్రీగా నే ఇస్తుంటారు. కొంత మంది దగ్గర మాత్రమే నామ మాత్రపు ఫీజు తీసుకుంటూ ఉంటారు. ఏ స్వార్థం లేకుండా పేద ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో ఆయన ఈ పనిచేస్తున్నారు.

ఓ వైపు కరోనా భయంతో వృద్ధులు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం లేదు. కానీ ఈ పెద్దాయన మాత్రం సైకిల్​ తీసుకొని ఊరూరా తిరుగుతూ సేవ చేస్తున్నాడంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రామచంద్ర దండేకర్ ఓ హోమియోపతి వైద్యుడు. 60 ఏళ్లుగా చంద్రపూర్, బల్లార్షా,ముల్,పొంబుర్ణ తాలూకాల్లో ఆయన వైద్య సేవలు అందిస్తున్నారు.

కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే ఉదయాన్నే సైకిల్‌పై బయలుదేరుతారు. పేషెంట్ల ఇంటి వద్దకే వెళ్లి ఉచితంగా చికిత్స అందిస్తారు. అలా పేషెంట్ల కోసమే ప్రతీరోజూ దాదాపు 10-15కి.మీ సైకిల్‌పై ప్రయాణిస్తారు. 'గత 60 ఏళ్లుగా పేదలకు వైద్యం అందిస్తున్నాను. నిజానికి కరోనా వైరస్‌కు భయపడి చాలామంది వైద్యులు పేషెంట్లకు వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారు. కానీ నాకు అలాంటి భయాలేవీ లేవు. ఈ రోజుల్లో యువ వైద్యులంతా డబ్బు కోసం పనిచేస్తున్నారు. ఇది చాలా దారుణం. పేదలకు సేవ చేయాలనే ఆలోచన వారికి ఉండట్లేదు.' అని డాక్టర్​ దండేకర్ అభిప్రాయపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దండేకర్​ను ఓ దేవుడిలా కొలుస్తున్నారు.