Begin typing your search above and press return to search.
భర్తను చంపిన 35 ఏళ్లకు టీవీ షో పట్టించింది
By: Tupaki Desk | 12 July 2019 1:26 PM ISTఅది 1984 మే 14. అంటే సరిగ్గా 35ఏళ్ల క్రితం నాటి సంగతి. భర్త జానీ ఆల్బ్రిటన్ ఇంట్లోనే తుపాకీతో కాల్చడంతో చనిపోయాడు. ఆయన భార్య నోర్మా ఆల్బ్రిటన్ వచ్చే సరికి భర్త రక్తపు మడుగులో ఉన్నాడట.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎవరో దుండగులు కాల్చి కిటీకీలోంచి పారిపోయారని బామ్మ చెప్పింది. భార్యపై అనుమానంతో పోలీసులు ఆమెకు లైవ్ డిటేక్టర్ పరీక్ష కూడా చేసినా హత్య చేసినట్టు నిర్ధారణ కాలేదు. ఆధారాలు దొరకకపోవడంతో ఆ కేసు చిక్కుముడి 35 ఏళ్లుగా వీడ లేదు.
అయితే తాజాగా ఈ ఆసక్తికర కేసును 2015లో లియోన్ కౌంటీ పోలీస్ అధికారి కెవిన్ ఎల్లిస్ డిజిటైజ్ చేసి కోల్డ్ జస్టిస్ అనే టీవీ షోకు ఇచ్చాడు. వారు ఈ కేసును చాలెంజింగ్ తీసుకొని పోలీసులు ఇచ్చిన ఆధారాలతో జానీ ఆల్బ్రిటన్ ఇంటి చుట్టుపక్కల , అనుమానితులైన 50 మందిని ఇంటర్వ్యూ చేశారు. షో నిర్వాహకుల విచారణలో భార్య నోర్మానే భర్తను హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది.
ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులకు సమర్పించడంతో జూలై 1న ఈ 85 ఏళ్ల బామ్మ నోర్మాను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. 34లక్షల పూచీకత్తుతో వృద్ధాప్యం కారణంగా ఆమెను విడుదల చేసి కోర్టు ద్వారా విచారణ జరుపుతున్నారు. అయితే షో నిర్వాహకులు ఏమేం ఆధారాలు సమర్పించారన్నది మాత్రం తెలియరాలేదు.