Begin typing your search above and press return to search.

రాహుల్ ప్రోగ్రాంలో భోజ‌నం చేస్తే రూ.82,500

By:  Tupaki Desk   |   5 Sep 2018 5:41 AM GMT
రాహుల్ ప్రోగ్రాంలో భోజ‌నం చేస్తే రూ.82,500
X
కొద్దిరోజులుగా విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల ఆయ‌న చేసిన యూకే ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప‌లువురుపార్టీ నేత‌లు అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రాహుల్ హాజ‌రైన కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం కోసం భారీ ఎత్తున చెల్లించాల్సి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. రాహుల్ పాల్గొన్న కార్య‌క్ర‌మంలో పాల్గొని.. భోజ‌నం చేయ‌టానికి ఒక్కొక్క‌రు 900 యూరోలు చెల్లించాల్సి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. మ‌న రూపాయిల్లో చెప్పాలంటే ఈ మొత్తం రూ.82,500గా చెబుతున్నారు.

ఈ ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాన్ని స‌భ‌ను నిర్వ‌హిస్తున్న వారు చేసిన‌ట్లుగా స‌మాచారం. యూకే..జ‌ర్మ‌నీ ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా రాహుల్ ను క‌లిసేందుకు వ‌చ్చిన వారంద‌రి ద‌గ్గ‌ర నుంచి ఇదే తీరులో వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఇండియ‌న్ ఓవ‌ర్ సీసీ కాంగ్రెస్ పేరుతో నిర్వ‌హించిన ఈ కార్య‌క‌మాల‌ను ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలా మార్చ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. రాహుల్ ఫారిన్ ట్రిప్ లో ఏర్పాటు చేసిన స‌భ‌ల‌ను నిర్వ‌హించింది బీజేపీకి.. కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీకి బాగా స‌న్నిహితంగా ఉన్న వారే చేప‌ట్టిన వైనం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని చివ‌రి నిమిషంలో తెలుసుకున్న కాంగ్రెస్ ఆ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. రాహుల్ కు ఉన్న క్రేజ్ ను అస‌రా చేసుకొని ఇలా ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్ట‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీని.. వ్య‌క్తిగ‌తంగా రాహుల్ ఇమేజ్ ను దెబ్బ తీసే ఇలాంటి అంశాల‌పై కాంగ్రెస్ కాస్త దృష్టి సారిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.