Begin typing your search above and press return to search.
మోడీ సర్కారు షాక్.. ఆ కార్ల రిజిస్ట్రేషన్ కు 800 శాతం వాయింపు
By: Tupaki Desk | 6 Oct 2021 11:05 AM ISTబాదుడులో వెనుకా ముందు చూసుకోకుండా బాదేసే ప్రభుత్వంగా మోడీ సర్కారు నిలుస్తోంది. దాదాపు మరో పదేళ్ల వరకు సెంచరీ దాటదని భావించిన లీటరు పెట్రోల్ ధరను వంద రూపాయిలు దాటేయటమే కాదు.. నూట పది దిశగా పరుగులు తీయించటంలో మోడీ సర్కారు సక్సెస్ అయ్యింది. ఇప్పటికే లీటర్ డీజిల్ ధర కూడా సెంచరీ దాటించేసిన ఘనతను సొంతం చేసుకొని.. మరే ప్రభుత్వం సాధించని రికార్డును తన పేరిట రాసుకోవటంలో మోడీ సక్సెస్ అయ్యారు. ఇప్పటికే పన్ను బాదుడు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ఏ మాత్రం అవకాశం చిక్కినా.. బాదేయటానికి మోహమాట పడని రీతిలో కేంద్రం నిర్ణయాలు ఉంటున్నాయి.
తాజాగా పాత వాహనాల రీ రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచేస్తూ నిర్ణయం తసీుకున్నారు. దేశ వ్యాప్తంగా పాత వాహనాలు.. అంటే 15 ఏళ్లకు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ ను పునరుద్దరించుకోవాలంటే ఇకపై భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న ఈ ఫీజు రూ.600 మాత్రమే. దాని స్థానే ఎనిమిది రెట్లు (800 శాతం) పెంచుతూ తాజాగా రూ.5వేలు చేయటం గమనార్హం.
కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 2021 పేరుతో తాజాగా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. పెంచిన ఛార్జీల్ని వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. అదే సమయంలో వాహన తుక్కు విధానాన్ిన ముందుకు తీసుకెళ్లే దిశగానూ కొన్ని ప్రోత్సాహకాల్ని కేంద్రం ప్రకటించింది. ఫిట్ నెస్ ధ్రువీకరణ పత్రం గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఫిట్ నెస్ పరీక్ష ఆలస్యమైతే.. రోజుకు రూ.50 చొప్పున అదనపు ఫీజును వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవటంలో ఆలస్యం చేస్తే.. ఒక్కో నెలకు వ్యక్తిగత వాహనం అయితే రూ.300.. వాణిజ్య వాహనమైతే రూ.500 చొప్పున లేట్ ఫీజును వసూలు చేస్తారు. ఫిట్ నెస్ ధ్రువీకరణ పత్రం పునరుద్ధరణకు ట్రక్కు.. బస్సు లకు ఇప్పటివరకు రూ.1500 వసూలు చేస్తుంటే.. ఇకపై రూ.12500 వసూలు చేయనున్నారు.