Begin typing your search above and press return to search.
కరోనా: విమానయాన రంగంలో 18 వేల ఉద్యోగాలు గల్లంతు !
By: Tupaki Desk | 17 Sept 2020 10:30 AM ISTకరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనా నుంచి ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరిస్తూ వస్తున్న ఈ కరోనా వల్ల ఇప్పటికే చాలా దేశాలు చాలా విధంగా నష్టపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన దేశంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పటికే వేల మంది మరణించారు. లక్షల మందికి ఈ వైరస్ సోకింది. కరోనా దెబ్బకి దేశీ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. మరీముఖ్యంగా వ్యాపార సంస్థలపై దీని ఎఫెక్ట్ బాగా పడుతోంది. లాక్ డౌన్ కారణంగా షాపింగ్ మాల్స్, రిటైల్ , విమానయాన రంగాలు మూతబడ్డాయి. ఆదాయం భారీగా క్షీణించింది.
ప్రస్తుతం లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చినప్పటికీ అన్ని రంగాల్లో సంక్షోభం తీవ్రంగా ఉంది. ఇప్పటికే సంక్షోభంలో పడిన భారత విమానయాన రంగంపై కరోనా వైరస్ దెబ్బ కోలుకోలేని విధంగా తాకనుంది. కరోనా వైరస్ కట్టడికి అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా కొన్నిరోజుల పాటు జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. దేశీయ విమానాలు ప్రారంభం అయినా కూడా .. అంతర్జాతీయ కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభం కాలేదు.
అంతేకాకుండా, 2019తో పోలిస్తే 2020లో భారతదేశం విమాన ప్రయాణ డిమాండ్ సగానికి పడిపోనుందని అంచనావేసింది. ప్రయాణీకుల రద్దీలో 47 శాతం క్షీణత కనిపించనుంది. కరోనా ఫలితంగా గత ఏడాది మార్చి జూలై తో పోల్చుకుంటే ఈ ఏడాది అదే సమయానికి 32 వేల కోట్లకు పైగా ఆదాయం కోల్పోవడంతో పాటు 18 వేల ఉద్యోగాలు గల్లంతయ్యాయి అని కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. ముఖ్యంగా గ్రౌండ్, కార్గో విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పోయాయని తెలిపింది.