Begin typing your search above and press return to search.

8 ఆకులున్న‌ మొక్క ధ‌ర‌.. 14 ల‌క్ష‌లు!

By:  Tupaki Desk   |   16 Jun 2021 11:30 PM GMT
8 ఆకులున్న‌ మొక్క ధ‌ర‌.. 14 ల‌క్ష‌లు!
X
న‌ర్స‌రీ నుంచి ఏదైనా మొక్క‌ను కొనుగోలు చేస్తే దాని ధ‌ర ఎంత ఉంటుంది? మ‌హా అయితే.. రూ. వంద‌ల్లో ఉంటుంది. బోన్సాయి వంటి వంటి మొక్క‌లైతే గ‌రిష్టంగా వేలు ఉండొచ్చు. కానీ.. ఈ మొక్క ధ‌ర తెలిస్తే మాత్రం షాక్ తినాల్సిందే. ఏకంగా రూ.14 ల‌క్ష‌లు ధ‌ర ప‌లికింది!

ఇంత ధ‌ర పెట్టారంటే.. దీనిలో అద్భుత శ‌క్తులు ఏమైనా ఉన్నాయ‌ని అనుకుంటున్నారేమో? అదేమీ కాదు. ఇది ఇంట్లో కారిడార్ లో పెంచుకునే ఒక కుండీ మొక్క‌. దీని ఆకులు తెలుపు, ఆకుప‌చ్చ రంగులు మిక్స్ అయి ఉంటాయి. అది కూడా కేవ‌లం 8 ఆకులు ఉన్నాయంతే!

న్యూజిలాండ్ ఆక్ష‌న్ వెబ్ సైట్ ‘ట్రేడ్ మీ’లో ఈ మొక్క‌ను వేలానికి పెట్టారు. ఈ మొక్క అరుదుగా ల‌భించ‌డ‌మే దీనికి ఇంత ధ‌ర ప‌లికేలా చేసింది. ఆక్లాండ్ కు చెందిన ఓ వ్య‌క్తి రూ.14 ల‌క్ష‌లు చెల్లించి ఈ మొక్క‌ను కొనుగోలు చేశాడు. ఈ మొక్క పేరు ‘రాపిడో ఫోరా టెట్రా స్పెర్మా’. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఇంటి మొక్క ఇదేన‌ని వెబ్ సెట్ తెలిపింది.

ఈ మొక్క‌ థాయ్ లాండ్‌, మ‌లేషియాలో ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఈ ప్లాంట్ గురించిన వివ‌రాలు రాయ‌ల్ గార్డెన్స్ కు చెందిన ఆన్ లైన్ ప్లాంట్ రిజిస్ట‌ర్ ‘క్యూ’లో నమోదయ్యాయి. ఏది ఏమైనా.. ఇంట్లో పెంచుకునే చిన్న మొక్క‌కు ఇంత ధ‌ర చెల్లించ‌డం ఏంట‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రికీ అర్థం కావ‌ట్లేదు.