Begin typing your search above and press return to search.

క్యాలిఫోర్నియా లో కాల్పులు .. 8 మంది మృతి , హంతకుడు కూడా.. !

By:  Tupaki Desk   |   27 May 2021 4:09 AM GMT
క్యాలిఫోర్నియా లో కాల్పులు ..  8 మంది మృతి , హంతకుడు కూడా.. !
X
ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా వెలుగొందుతోన్న అమెరికాలో నిత్యం కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. ప్రతి రోజు అమెరికాలో ఎక్కడో ఒక చోట నరమేధం జరుగుతూనే ఉంది. తాజాగా మరో ఘటన జరిగింది. ఆ ఘటన లో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. కాలిఫోర్నియా లోని శాన్‌ ఫ్రాన్సిస్‌ కో నగరం సమీపంలోని లైట్‌ రెయిల్‌ యార్డులో ఈ ఘోరం చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే ఉద్యోగే సహచరులపై కాల్పులకు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందారు. శాన్ జోస్‌ లోని శాంటా క్లారా లోకల్ వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే ఈ యార్డులో దుండగుడు బుధవారం కాల్పులకు పాల్పడ్డాడు. అయితే , ఈ ఘటనలో మృతి చెందినవారిలో నిందితుడు కూడా ఉండటం గమనార్హం.

ఆ కాల్పుల ఘటనలో మృతి చెందిన మృతులంతా ట్రాన్స్‌పోర్టేషన్‌ సంస్థకు చెందిన ఉద్యోగులేనని అధికారులు తెలిపారు. ఉద్యోగుల సమావేశం జరుగుతుండగా దుండగుడు కాల్పులకు పాల్పడినట్టు ఓ బాధితుడి తల్లి చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. రైలు యార్డులో పేలుడు పదార్థాలు కూడా ఉన్నట్టు సమాచారం అందడంతో బాంబు స్క్యాడ్‌ తో తనిఖీలు చేపట్టినట్టు శాంటా క్లారా కౌంటీ అధికారి రస్సెల్ డేవిస్ తెలిపారు. ఘటనలో ఎనిమిది మంది చనిపోయారని, వీరిలో నిందితుడు కూడా ఉన్నారని తెలిపారు. బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన గురించి 911 కాల్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడా, తనను తాను కాల్చుకున్నాడా, ఎటువంటి ఆయుధం వినియోగించడనేది, క్లారిటీ గా తెలియదు అని అధికారులు తెలిపారు. తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన బైడెన్.. గన్‌ వయలన్స్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎపడిమిక్‌ పేరుతో గత నెలలో బైడెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఫెడరల్‌ ఏజెంట్, తుపాకుల నియంత్రణ వ్యవస్థకి సలహాదారుడైన డేవిడ్‌ చిప్‌ మ్యాన్‌ ను బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ ఆర్మ్స్,ఎక్స్‌ ప్లోజివ్స్‌ కుకు డైరెక్టర్‌గా నియమించారు. పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే బైడెన్‌ చేపట్టిన చర్యలన్నీ చట్టంగా మారాల్సి ఉంది.