Begin typing your search above and press return to search.

ఈ బుడ్డోడిది ఐన్ స్టీన్ ను మించిన తెలివి...!

By:  Tupaki Desk   |   27 Jan 2023 10:21 AM GMT
ఈ బుడ్డోడిది ఐన్ స్టీన్ ను మించిన తెలివి...!
X
పిట్ట కొంచెం కూత ఘనం అనే మాటకు అతికిచ్చినట్టు ఈ బుడతడు సరిపోతాడు. చిన్నతనం నుంచి అందరికీ కంటే చురుకుగా ఉండటమేగాక అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానం చెబుతూ బాల మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎనిమిదేళ్లకే రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు.

ఇంతకీ ఆ బుడ్డోడు ప్రత్యేకతలు ఏంటంటే?. బెంగూళూరుకు చెందిన రిషికి చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. రిషి తండ్రి శివ ప్రసన్న కుమార్ ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ కాగా తల్లి ఐటీ ఇంజనీర్. ఐదేళ్ల నుంచి రిషి సాఫ్ట్ వేర్ పై అవగాహన పెంచుకున్నాడు. తల్లి నుంచి అనేక మెలకువలు నేర్చుకున్నాడు.

కోడింగ్ పై పట్టు సాధించిన చిన్నతనంలోనే సొంతంగా మూడు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను రూపొందించాడు. 'ఎలిమెంట్ ఆఫ్ హార్థ్' అనే పుస్తకాన్ని సైతం రచించాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తూ చిన్నా పెద్దా అందరికీ సైన్స్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలను వివరాణ్మతకంగా ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఇతరులను సైతం పుస్తకాలు చదవాలని సలహా ఇస్తుంటాడు. బాలమేధావిగా గుర్తింపు రిషి పెద్దయ్యాక సైంటిస్ట్ అవ్వాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలతో ముందుకెళుతున్నాడు. కాగా 8ఏళ్ళ వయస్సులో రిషి పాతికేళ్ల ప్రతిభావంతులు ఆలోచించినట్లు ఆలోచనలు చేస్తుండటం విశేషం.

మనోడి ఐక్యూ లెవల్స్ ఐన్ స్టీన్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రతిభావంతులైన యువత ఐక్యూ సగటు 130 కాగా ఈ బుడ్డోడి ఐక్యూ మాత్రం మరో 50 పాయింట్లు ఎక్కువగా ఉంది. అంటే రిషి ఐక్యూ 180 పాయింట్స్ ఉందన్న మాట. రిషి ప్రతిభను గుర్తించిన కేంద్రం 8 ఏళ్ళకే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కారాన్ని అందజేసింది. ఇక అంతకముందే యూకేలోని మెన్సాలో రిషి సభ్యుడు కావడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.