Begin typing your search above and press return to search.

ట్రంప్ vs బైడెన్‌ : రూ. 7500 కోట్ల బెట్టింగ్ ... విజయం ఎవరిది?

By:  Tupaki Desk   |   31 Oct 2020 5:15 PM GMT
ట్రంప్ vs బైడెన్‌ : రూ. 7500 కోట్ల బెట్టింగ్ ... విజయం ఎవరిది?
X
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పై హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వరుసగా రెండో సారి ఎన్నికల బరిలో ఉన్నారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో ఇద్దరు ఒకరి పై ఒకరు విమర్శలు , ఆరోపణలతో హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి ఎలాగైనా అధ్యక్ష పీఠం పై కూర్చోవాలని ట్రంప్ , ట్రంప్ ను ఓడించాలని బైడిన్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక అమెరికాలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. రోజుకి లక్షకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కువుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయింది కూడా అమెరికాలోనే దాదాపుగా అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. దీనితో చాలామంది ముందస్తు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ..ఎలక్షన్స్ అంటే , ఎవరు గెలుస్తారు , ఎవరి కెపాసిటీ ఎంత అనే దానిపై బెట్టింగ్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ కోణంలోనే ఈ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం రూ 7500 కోట్ల (1 బిలియన్ అమెరికన్ డాలర్స్) బెట్టింగ్ జరుగుతుందట.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు బెట్టింగ్ రాయుళ్లకు ఓ వరంలాంటిది. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా పోలింగ్ కూడా ముగియకముందే విజేత పై రూ 7500 కోట్ల బెట్టింగ్ జరిగినట్టు అంచనా. ఇక బెట్టింగ్ పెట్టినవారిలో దాదాపుగా 70 శాతం మంది ట్రంప్ విజయం సాధిస్తాడు అని బెట్టింగ్ పెట్టారట. దీనికి ప్రధాన కారణం .. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోతున్నాడు. దీనితో ఆయనకి కొన్ని సానుకూలతలు ఉండబోతున్నాయి. ఈ కారణంతో ట్రంప్ విజయం ఖాయం అని 70 శాతం మంది బెట్టింగ్ పెట్టారట. అయితే , బుకీల అంచనా ప్రకారం ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిచి అవకాశం 10 నుండి 35 శాతం మాత్రమే ఉందట. కానీ, బైడిన్ కి 65 శాతం గెలిచే అవకాశం ఉందట. అయితే , ఎన్నికల ఫలితాలు అంచనా వేయడం అనుకున్నంత సులువు అయితే కాదు. పోలింగ్ ముగిసి కచ్చితమైన ఫలితాన్ని వెల్లడించే వరకు ఎవరు విజయం సాధిస్తారో ఎవ్వరం చెప్పలేము.