Begin typing your search above and press return to search.

బీజేపీకి 750 కోట్లు, కాంగ్రెస్ కి 139 కోట్లు.. తాజా లెక్కలివే ?

By:  Tupaki Desk   |   10 Jun 2021 8:30 AM GMT
బీజేపీకి 750 కోట్లు, కాంగ్రెస్ కి 139 కోట్లు.. తాజా లెక్కలివే ?
X
మనదేశంలో రాజకీయ పార్టీలకి పెద్ద ఎత్తున విరాళాలు కార్పోరేట్ కంపెనీల నుంచి, ఎన్ ఆర్ ఐల నుండి, పెద్ద పెద్ద వ్యాపార వేత్తల నుంచి అందుతాయని అందరికి తెలిసిందే. ఇంకా వివరంగా చెప్పాలి అంటే.. ప్రస్తుతం దేశంలో ఉన్న పార్టీలు అన్ని కూడా దేశంలో కార్పోరేట్ వ్యవస్థ ఇస్తున్న విరాళాలతో ముందుకు సాగుతున్నాయన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ విరాళాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మాత్రం ఎవరు చెప్పరు. అయితే 20 వేల కంటే ఎక్కువ విరాళాలు తీసుకుంటే ఆ డొనేషన్ ఇచ్చిన వ్యక్తి వివరాలు చెప్పాలని ఎన్నికల సంఘం ఓ నిబంధనను తీసుకొచ్చింది. కానీ,ఆ నింబంధనను రాజకీయ పార్టీలు ఏ మేర పాటిస్తున్నాయి అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే .. దేశంలో అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా వరుసగా ఏడో ఏడాది కూడా భారతీయ జనతా పార్టీ రికార్డ్ సృష్టించింది. కాంగ్రెస్ కి వచ్చిన విరాళాలతో పోల్చితే బీజేపీ కి ఐదు రేట్లు ఎక్కువగా విరాళాలు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ కి సమర్పించిన వివరాల ప్రకారం .. 2019 -2020 లో బీజేపీకి కంపెనీలు , వ్యక్తుల నుండి మొత్తం రూ. 750 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇక కాంగ్రెస్ కి 139 కోట్లు విరాళంగా వచ్చింది. ఇక ఎన్సీపీ కి 59 కోట్లు ,సీపీఎం కి 19.6కోట్లు , టిఎంసికి 8 కోట్లు ,సిపిఐ కి 1.9 కోట్లు విరాళంగా వచ్చాయి. అయితే ఇవి అధికారికంగా పార్టీలు చెప్పిన విరాళాలు, అనధికారికంగా మాత్రం లక్షల కోట్ల విరాళాలు పార్టీలకి వస్తూ ఉంటాయనేది అందరి తెలిసిన నిజం.