Begin typing your search above and press return to search.

ఏపీ కరోనా అప్డేట్ : 24 గంటల్లో ఎన్ని కేసులంటే!

By:  Tupaki Desk   |   23 Sept 2020 10:00 PM IST
ఏపీ కరోనా అప్డేట్ : 24 గంటల్లో ఎన్ని కేసులంటే!
X
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ, కొత్త కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఏపీ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం .. ఏపీలో గత 24 గంటల్లో 7,228 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల క్రితం వరకు ప్రతి రోజు 10 వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొంచెం కొంచెంగా నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో 72,838 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,46,530 కు చేరింది. గత 24 గంటల్లో 45 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,506కి చేరింది. ప్రస్తుతం 70,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,291 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,70,667కి చేరింది. అలాగే , గత 24 గంటల్లో కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.