Begin typing your search above and press return to search.

కువైట్ నుండి 70 వేల మంది వెనక్కి ... ఇదే కారణం !

By:  Tupaki Desk   |   29 Nov 2020 2:40 PM IST
కువైట్ నుండి 70 వేల మంది వెనక్కి ... ఇదే కారణం !
X
కువైట్ .. ఎంతోమంది అక్కడికి పనుల కోసం వెళ్లి , జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా ఇండియా నుండి ఎక్కువ మంది కువైట్ కి బతుకుదెరువు కోసం వెళ్తుంటారు. జీవితంలో ఎదగడానికి కొందరు , జీవితంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని వాటిని దాటడానికి మరికొందరు కువైట్ కి వెళ్తుంటారు. అక్కడైతే మంచి జీతం ఉంటుంది. రెండు , మూడేళ్ళ పాటు ఓపికతో ఉంటే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చు అనే భావనలో చాలామంది కువైట్ వైపు చూస్తుంటారు. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ కి పనుల కోసం వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఆ గల్ఫ్ కంట్రీస్ కి ఒక్క ఇండియన్స్ మాత్రమే కాదు , ప్రపంచంలోని చాలా దేశాల వారు వస్తుంటారు.

ఇదిలా ఉంటే .. ఈ మద్యే కువైట్ ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లకు పైబడిన ప్రవాస కార్మికులకు వచ్చే ఏడాది నుంచి వర్క్ వీసా రెన్యూవల్ ఉండదని కువైట్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయం వచ్చే జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ కారణంగా 2021లో 60 ఏళ్లకు పైబడిన సుమారు 70 వేల మంది ప్రవాసులు వెనక్కి రాబోతున్నారు. కువైటైజేషన్, దేశంలో జనాభా సమతుల్యతను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా విదేశీయుల నియామకాన్ని తగ్గించడమే దీనికి కారణం. ఇందులో భాగంగానే కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ ‌పవర్ 60 ఏళ్లు నిండినవారికి రెసిడెన్సీ అనుమతుల పునరుద్ధరణను నిషేధించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే 60 ఏళ్లు పైబడిన ప్రవాసుల జాబితాలను రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కువైట్ జనరల్ డిపార్ట్‌ మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్, 60 ఏళ్లు నిండిన ప్రవాసులకు దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ఒకటి నుంచి మూడు నెలల గడువిచ్చింది.