Begin typing your search above and press return to search.

సీఎం సొంత జిల్లాలో చిన్నారి పెళ్లి కూతుళ్లు..!

By:  Tupaki Desk   |   20 April 2016 12:09 PM GMT
సీఎం సొంత జిల్లాలో చిన్నారి పెళ్లి కూతుళ్లు..!
X
సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో బాల్య వివాహాలు జోరుగా జరుగుతున్నాయి. మెదక్ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకో చిన్నారి పెళ్లి కూతురు ప్రత్యక్షమవుతోంది. గడచిన రెండు నెలల్లో అంటే ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 18 వరకు సుమారు 70 మంది చిన్నారులను చివరి క్షణంలో బాల్య వివాహాల నుంచి కాపాడారు చైల్డ్ లైన్ ప్రతినిధులు. ఈ లెక్కలు సమాచారం అందినవి మాత్రమే. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పెళ్లిళ్లు ఇంకా ఎన్నో.యూనిసెఫ్ - సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఎన్నో షాకింగ్ వార్త‌లు వెలుగులోకి వచ్చాయి.

సాధారణంగా బాల్యవివాహాలు.. స్కూల్ మధ్యలో మానేసినప్పుడు.. ఉన్నత చదువులు చదివించలేనప్పుడు ఎక్కువగా జరుగుతాయని చైల్డ్ లైన్ ప్రతినిధులు అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కరవు కూడా బాల్యవివాహాలకు ఓ కారణమంటున్నారు. ఈ పెళ్లిళ్లకు ఊరి పెద్దలు - సర్పంచ్ లు.. అంగన్ వాడీ టీచర్లు కూడా వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. నకిలీ వయస్సు ధ్రువీకరణ పత్రాలతో పెళ్లిళ్లు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం.. చైల్డ్ వెల్ఫేర్ బోర్డులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని…. సామాజిక కోణంలో సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

బాల్య వివాహాలకు గల కారణాలను తెలుపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి....సామాజిక అంశాలు కూడా ఓ కారణమవుతున్నాయి. పరువు ప్రతిష్టల పేరుతో బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. అలాగే ఆచార వ్యవహారాలు, మేనరికాలు, అధిక కట్నాలు…ఇలా ఒక్కో కుటుంబంలో ఒక్కో అంశం కారణమవుతోంది. ఆర్థిక కారణాలు బాల్యవివాహాలకు కారణమవుతున్నాయి. ఆడ పిల్లలు పెద్దవాళ్లైతే కట్నాలు కూడా ఎక్కువ ఇవ్వవలసి వస్తుందనే ఆందోళనతో పెళ్లి చేసేస్తున్నారు. లింగవివక్షత.. ఓ అయ్యకు కట్టబెట్టేస్తే పనైపోతుందనే ఆలోచనతో మెచ్యురిటీ కూడా తీరకుండానే పెద్దలు పెళ్లి చేసేస్తున్నారు. భద్రతాపరమైన కారణాలు కూడా బాల్యవివాహాలు ఓ కారణం. పెళ్లి చేస్తే సెక్యురిటీ ఉంటుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఉండే నిరక్షరాస్యత బాల్యవివాహాలకు కారణం అని తెలుస్తోంది.