Begin typing your search above and press return to search.

మెడికల్‌ కాలేజీలో 7 మంది విద్యార్ధులకి వైరస్ పాజిటివ్‌ !

By:  Tupaki Desk   |   26 Jun 2020 6:45 AM GMT
మెడికల్‌ కాలేజీలో 7 మంది విద్యార్ధులకి వైరస్ పాజిటివ్‌ !
X
వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల హాస్పిటల్ లో పనిచేస్తున్న ఏడుగురు వైద్య విద్యార్థులకు ఈ వైరస్ పాజిటివ్ అని తేలింది.‌ గత రెండు మూడు రోజులుగా వైద్యవిద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ ‌లుగా తేలినవారిని అయనవరంలోని ఈఎస్ ‌హాస్పిటల్ కు తరలించామని చెప్పారు. స్టాన్లీ మెడికల్‌ కాలేజీలో ఇప్పటికే 20 మంది విద్యార్థులకు వైరస్ సోకింది.

చెన్నైలోని మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ లో, కిల్పాక్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఒమన్ ‌దురార్‌ ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పలువురికి వైరస్ పాజిటివ్‌ అని తేలడంతో వారందరిని క్వారంటైన్‌ చేశారు. ఇకపోతే దేశంలో వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. కాగా, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మన దేశంలో 17,296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 407 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్ ‌లో మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కి చేరింది. వీరిలో వైరస్ మహమ్మారితో పోరాడుతూ 2,85,637 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 15,301 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 1,89,463 యాక్టివ్ వైరస్ కేసులున్నాయి.