Begin typing your search above and press return to search.
ఇంటరెస్టింగ్ సర్వే... చీటింగ్ లో మహిళలదే ముందంజట
By: Tupaki Desk | 27 Feb 2020 9:30 AM ISTజీవిత భాగస్వాములను మోసం చేయడం ఇటీవలి కాలంలో... ప్రత్యేకించి ఆధునిక యుగంలో సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. భార్యకు తెలియకుండా భర్త మరొకరితోనో, మరి కొందరితోనూ వివాహేతర సంబంధాలను నెరపుతున్న వైనం కూడా మనకు కొత్తేమీ కాదు. ఈ విషయంలో ఇప్పటిదాకా అంతా పురుషులనే తప్పుబడున్న వైనం కూడా మనకు తెలియనిదేమీ కాదు. అయితే పురుషుడు తన జీవిత భాగస్వామిని మోసం చేసి మరికొందరితో సంబంధం నెరపుతున్నాడంటే... అతడితో వివాహేతర సంబంధాలు నెరపుతున్న మహిళలకు కూడా పాత్ర ఉందన్న మాటే కదా. మరి ఈ విషయంలో మహిళలను వదిలేసి కేవలం పురుషులను మాత్రమే నిందించడం తగదు కదా. నిజమే... అందుకే ఇప్పుడు జరిగిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జీవిత భాగస్వామిని మోసం చేస్తున్న విషయంలో ఇప్పుడు పురుషుల కంటే మహిళలే పైచేయి సాధించారట.
జీవిత భాగస్వామిని చీట్ చేస్తూ వివాహేతర సంబంధాలు నెరపుతున్న విషయంలో మహిళలే ముందంజ లో ఉన్నారన్న మాట నమ్మశక్యంగా లేదు కదూ. అయితే ఈ విషయం పై జరిగిన ఓ సర్వే చూస్తే మీరే అవాక్కవుతారు. ఎందుకంటే... ఈ సర్వేలో పాలుపంచుకున్నది కొంతమందే అయినా... జీవిత భాగస్వామిని మోసం చేస్తూ ఎంజాయి చేస్తున్న వారిలో మగాళ్ల కంటే మగువలే అధిక శాతం ఉన్నారట. గ్లీడెన్ అనే డేటింగ్ యాప్ చేసిన ఈ సర్వే ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టేసింది. ఈ సర్వేలో చీటింగ్ చేస్తున్న వారిలో మగాళ్ల కంటే మగువలే ముందంజలో ఉన్నారన్న విషయం వెల్లడైంది.
మన దేశానికి సంబంధించి ఈ సర్వే సంస్థ 1525 మందిపై సర్వే చేసింది. వీరంతా 25-50 ఏళ్ల మధ్య వయస్సున్న వారే. ఈ సర్వేలో ఓవరాల్ గా 55 శాతం మంది తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారని తేలింది. ఈ 55 శాతం మందిలో సగానికి పైగా అంటే... 56 శాతం మంది మహిళలేనట. తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్న భారత పురుషుల సంఖ్య 48 శాతంగా నమోదైంది. మిగిలిన 56 శాతం మంది భర్తలను మోసం చేస్తూ వివాహేతర సంబంధాలు నెరపుతున్న భార్యామణులేనట. మరి చీటింగ్ లో మగాళ్ల కంటే మగువలదే పైచేయి కదా.