Begin typing your search above and press return to search.

నేతాజీ ఫ్యామిలీకి పీఎంవో నుంచి ఫోన్లే.. ఫోన్లు

By:  Tupaki Desk   |   20 Sep 2015 9:38 AM GMT
నేతాజీ ఫ్యామిలీకి పీఎంవో నుంచి ఫోన్లే.. ఫోన్లు
X
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన వార్తలు భారీగా వస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బోస్ కు సంబంధించిన 64 రహస్య ఫైళ్లల్లోని సమాచారాన్ని బయటపెట్టింది. తాజా చర్యతో బోస్ కు చెందిన రహస్య ఫైల్స్ గా భావించే వాటిల్లో నుంచి వేలాది పేజీలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

ఇదిలా ఉంటే.. మరోవైపు భారత ప్రభుత్వం బోస్ కు సంబంధించిన రహస్య ఫైళ్లను బయటపెట్టాలని భావిస్తోంది. అయితే.. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే.. చంద్రబోస్ కుటుంబ సభ్యుల్ని కలవాలని ప్రధాని మోడీ భావించటం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లే జరిగితే అక్టోబరు 14న బోస్ కుటుంబ సభ్యుల్ని మోడీ కలవనున్నారు.

ప్రధానమంత్రి లాంటి వ్యక్తి బోస్ కుటుంబ సభ్యుల్ని కలవనున్నారంటే అది చిన్న విషయం కాదు కదా. దీనికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు భారీగా ఉంటాయి. ఈ కారణంతోనే గడిచిన కొద్దిరోజుల్లో దాదాపు ఏడు ఫోన్ కాల్స్ పీఎంవో (ప్రధాని కార్యాలయం) నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. మోడీతో కలిసే కార్యక్రమానికి సంబంధించిన అంశాలు చర్చించేందుకు వివిధ దశల్లో ఫీఎంవో వారికి ఫోన్లు చేసి వివరాలు తీసుకున్నారు. మొత్తంగా 49 మందితో కూడిన బృందం ప్రధాని మోడీని కలవనున్నారు. వీరిలో 35 మంది వరకు నేతాజీ కుటుంబ సభ్యులు.. మరో 14 మంది శాస్త్రవేత్తలు తదితరులు ఉంటారన్నది సమాచారం.