Begin typing your search above and press return to search.
ఘోర రోడ్డు ప్రమాదం.. 7 ఇంజనీరింగ్ విద్యార్థుల మృత్యువాత
By: Tupaki Desk | 29 May 2023 2:00 PMదారుణ రోడ్డు ప్రమాదం అసోంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఘటనా స్థలంలోనే మరణిచంగా.. మరో ఆరుగురు గాయపడిన ఉదంతం చోటు చేసుకుంది. ఈ (తెల్లవారుజామున) జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం వేగంగా కారును నడపటమేనని చెబుతున్నారు.
గువాహటిలోని అసోం ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న పది మంది విద్యార్థులు నిన్న అర్థరాత్రి దాటినతర్వాత క్యాంపస్ నుంచి కారులో బయలుదేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ అతి వేగంగా నడపటంతో అతను వాహనం మీద నియంత్రణ కోల్పోయాడు. ఈ తెల్లవారుజామున.. జలూక్ బరీ ప్రాంతంలో కారు డివైడర్ ను దాటుకొని ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ ను బలంగా ఢీ కొట్టింది.
దీంతో.. కారులోని విద్యార్థుల్లో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పికప్ వ్యాన్ లో ఉన్న ముగ్గురు కూడా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని గువాహటిలోని మెడికల్ కాలేజీలోని ఆసుపత్రికి తరలించారు.
వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. కారును అద్దెకు తీసుకున్న విద్యార్థులు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.