Begin typing your search above and press return to search.
30 ఏళ్లుగా టీ మాత్రమే తాగే ఆమె ఎంత హెల్దీనో తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 28 Sept 2020 6:00 AM ISTకొన్ని సిత్రాలు ఏ మాత్రం నమ్మటానికి వీల్లేని రీతిలో ఉంటాయి. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకే చెందుతుంది. రోజువారీగా తినాల్సిన తిండి తింటేనే ఏదో ఒక ఆరోగ్య సమస్యలు. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్.. రాత్రికి మళ్లీ భోజనం.. ఇలా ఫుడ్ టైంటేబుల్ ను కాస్త అటూ ఇటూగా అందరూ ఫాలో అవుతుంటారు. ఇక.. ఏదైనా కారణంతో ఒకట్రెండు రోజులు భోజనం లేకపోతే.. కిందా మీదా పడిపోతాం. భూమి.. ఆకాశం ఏకమైనట్లుగా హడావుడి చేసే వారికి కొదవ ఉండదు.
అలాంటిది ఒక మహిళ గడిచిన 30 ఏళ్లుగా రోజు టీ మాత్రమే ఆహారంగా తీసుకోవటం.. ఆమె ఆరోగ్యం భేషుగ్గా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా ఒక మీడియా సంస్థ కారణంగా ఈ విషయం బయటకు వచ్చింది. పశ్చిమబెంగాల్ కు చెందిన సుందరణి మెహంతో అనే 67 ఏళ్ల మహిళ.. రోజువారీ ఆహారంగా టీ మాత్రమే తీసుకుంటారు. అయినా ఆమె ఆరోగ్యం మాత్రం భేషుగ్గా ఉందని చెబుతున్నారు.
ఆమె విషయానికి వస్తే.. ఇంట్లో గొడవల కారణంగా ఆమె కొడుకు 30 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి బంగ్లాదేశ్ కు వలస వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కొడుకు మీద బెంగతో అన్నం తినటం మానేసింది. దాని స్థానే.. రోజుకు పది.. పన్నెండు కప్పుల టీ మాత్రమే తాగుతూ కాలం గడుపుతున్నారు. నెలలు కాస్తా సంవత్సరాలుగా.. ఏళ్లు.. దశాబ్దాలుగా కరిగిపోయాయి. కానీ.. ఆమె మాత్రం తన పంతాన్ని వీడటం లేదు. కొడుకు వచ్చాక మాత్రమే అన్నం తింటానని చెప్పే ఆమె.. నిత్యం టీతోనే కడుపు నింపుకోవటం విశేషం.
అయినప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారన్నది ఆశ్చర్యకరంగా మారింది. అయితే.. ఆమె తాగే టీలో ఎక్కువశాతం పాలు ఉండేలా చూసుకోవటమే ఆమె ఆరోగ్యానికి కారణమంటున్నారు. ఎందుకంటే.. పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు.. ప్రోటీన్లు ఆమెకు అవసరమైన పోషకాల్ని ఇస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. చిన్న గుడిసెలో ఉంటూ టిఫిన్ దుకాణం నడిపే ఆమె ఇప్పటికి వెళ్లిపోయిన తన కొడుకు తిరిగి వస్తాడన్న ఆశతో గడుపుతున్నారు. ఆ కొడుకు ఎప్పుడు వస్తాడో.. ఈ అమ్మ ఎప్పుడు అన్నం తింటుందో..? తన కోసం తన తల్లి చేసిన త్యాగం గురించి ఆ కొడుక్కి ఎప్పటికి తెలుస్తుందో?