Begin typing your search above and press return to search.

600 ఏళ్లు జైలు శిక్ష .. ఏంచేసాడో తెలుసా ?

By:  Tupaki Desk   |   3 Oct 2020 1:00 PM IST
600 ఏళ్లు జైలు శిక్ష .. ఏంచేసాడో తెలుసా ?
X
మహా అయితే ఈ భూమి మీద మనిషి బతికేది వందేళ్లు. ఆ వ్యక్తి అదృష్టం భావుంటే మరో పదో, ఇరవై ఏళ్లు అతి కష్టం మీద బతుకుతాడు. ఇక ఎవరైనా వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే అతడికి విధించే గరిష్ట శిక్ష.. జీవితకాల ఖైదు. కానీ అమెరికాలో ఒక వ్యక్తికి 600 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు సంచలన తీర్పునిచ్చారు. అసలు మనిషి అన్ని ఏళ్లు బ్రతికి ఉండడు కదా అంటే .. ఆటగాడు చేసిన దారుణాల గురించి తెలుసుకుంటే 600 కాదు 1200 ఏళ్లు జైలు శిక్ష విధించాలని చెప్తారు.

ఇంతకీ అతడు చేసిన అంతటి నేరమేమిటంటే..టుస్కలుసకు చెందిన మాథ్యూ టైలర్ మిల్లర్ కు ఈ శిక్ష పడింది. ఆయన ఇద్దరు బాలికలను రేప్ చేసినందుకు గానూ ఇంత భారీ శిక్ష విధించారు. ఇద్దరు మైనర్ బాలికలతో లైంగిక సంబంధం కలిగి ఉండటమే గాక.. 2014 నుంచి 2019 దాకా చిన్న పిల్లలను లైంగికంగా వాడుకునేవాడని ఆరోపణలున్నాయి. బాలికలు అతడితో లైంగికంగా గడపడానికి వారిని ప్రలోబాలకు గురిచేసేవాడని ఆయనే ఒప్పుకున్నాడు. ఈ ఘటనలు జరిగినప్పుడు బాధితుల వయసు ఆరేండ్ల నుంచి పన్నెండ్ల లోపే ఉంటుందని అతడు చెప్పాడు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులకు బలమైన రుజువులు కూడా కనిపించాయి. అతడి మొబైల్, ల్యాప్ ట్యాప్ లలో సుమారు 100 కు పైగా అశ్లీల చిత్రాలు ఉన్నాయి. అవన్నీ చిన్న పిల్లలతోనే చిత్రీకరించినవి కావడం గమనార్హం. మిల్లెర్ తన నేరాన్ని 2019 అక్టోబర్ లో అంగీకరించాడు. అందుకే అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి స్కాట్‌ కూగ్లర్‌ అతడికి ఈ శిక్ష విధించారు. 2 ఏళ్ల లోపున్న చిన్నారిపైనా అత్యాచారం చేసినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, 2019లో మిల్లర్ తన నేరాన్ని అంగీకరించాడు. తాజాగా, శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.