Begin typing your search above and press return to search.
సెల్ఫీలు తీసుకున్న వారు అండగా ఉండవద్దా?
By: Tupaki Desk | 12 April 2019 7:00 AM ISTవివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటించిన 'పీఎం నరేంద్ర మోడీ' ఎన్నికల నేపథ్యంలో విడుదల సమస్యలను ఎదుర్కొంటున్న విసయం తెల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఈనెల ఆరంభంలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. సుప్రీం కోర్టుకు వెళ్లడంతో సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నేడు విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఒక్క రోజు ఆలస్యంగా రేపు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఈ చిత్రం విడుదలకు నానా ఇబ్బందులు పడుతున్న తమకు సినిమా పరిశ్రమ నుండి ఏమాత్రం మద్దతు దక్కడం లేదని వివేక్ ఒబేరాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించిన ఎంతో మంది స్టార్స్ ఆయన జీవితం గురించి సినిమా తీస్తే మాత్రం దాని గురించి ఎవరు స్పందించడం లేదు. పీఎం నరేంద్ర మోడీ సినిమాకు ఏ ఒక్కరు కూడా మద్దతు తెలపడం లేదు. చిత్ర పరిశ్రమ మొత్తం ఐక్యంగా ఉండాలి, ఏ సినిమాకైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. బాలీవుడ్ లోని దాదాపు 600 మంది ఆర్టిస్టులో మోడీ మళ్లీ అధికారంలోకి రావద్దని కోరుకుంటున్నారు. అందుకే వారంతా కూడా పీఎం నరేంద్ర మోడీ సినిమాకు వ్యతిరేకంగా ఉన్నారని వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివేక్ ఒబేరాయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నా మీడియా ముందుకు వచ్చి మాత్రం ఖండించడం లేదు. మొత్తానికి పీఎం నరేంద్ర మోడీ సినిమా నేపథ్యంలో బాలీవుడ్ లో వివాదాలు భగ్గుమంటున్నాయి.