Begin typing your search above and press return to search.

వాలంటీర్ పై 60 ఏళ్ల వృద్ధుడు అసభ్య ప్రవర్తన... నిర్భయ కేసు నమోదు !

By:  Tupaki Desk   |   29 July 2020 1:00 PM IST
వాలంటీర్ పై  60 ఏళ్ల వృద్ధుడు అసభ్య ప్రవర్తన... నిర్భయ కేసు నమోదు !
X
గ్రామ /వార్డ్ వాలంటీర్ వ్యవస్థ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రతి ఒక్కరికి వారి గడప వద్దకే ప్రభుత్వ పథకాల్ని అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు లోకి తీసుకువచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు ఏ పని అయినా కూడా చాలా సులభంగా సాగిపోతుంది. ఏది కావాలన్న కూడా .. వాలంటీర్ కి చెప్తే సరిపోతుంది. అలాగే వృద్దులకి నెల మొదటి తారీఖునే ఇంటికే తెచ్చి పింఛన్ డబ్బు ఇస్తున్నారు.అలాగే ప్రస్తుతం కరోనా కాలంలో ముందుండి నడిపిస్తూ .. కరోనా వారియర్స్ గా నిలుస్తున్నారు. అయితే , ప్రజల కోసం పనిచేస్తున్న వలంటీర్ల పై కూడా వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు తన వయస్సుకి తగ్గ పని చేయకుండా మహిళా వాలంటీర్ ని వేధింపులకు గురిచేశాడు. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరు గ్రామంలో, గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళపై రామకృష్ణ అనే వ్య‌క్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనితో ఆ వృద్ధుడి ప్రవర్తనతో ఇబ్బందిప‌డ్డ వాలంటీర్ ఇంటికి వెళ్లి తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది. దింతో ఆ ‌ మహిళ భర్త రామకృష్ణ ఇంటికి వెళ్లి జరిగిన విషయం పై నిలదీశాడు. అయితే, తప్పు చేసినప్పటికీ ఎదురుదాడికి దిగిన రామకృష్ణ, అతని కుమారులు కలిసి గ్రామ వాలంటీర్ భర్తపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో మ‌హిళా గ్రామ వాలంటీర్, పామిడి పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంతో పాటు క‌రోనా స‌మ‌యంలో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న వాలంటీర్ పై ఇలాంటి‌ దాడి జ‌ర‌గడం ప‌ట్ల స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.