Begin typing your search above and press return to search.

హర్షా భోగ్లే చేసిన 6 ఏళ్ల క్రితం ట్వీట్ వైరల్ .. ఆ ట్విట్ లో ఏముందంటే

By:  Tupaki Desk   |   29 Nov 2021 7:32 AM GMT
హర్షా భోగ్లే చేసిన 6 ఏళ్ల క్రితం ట్వీట్ వైరల్ .. ఆ ట్విట్ లో ఏముందంటే
X
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో న్యూజీలాండ్‌ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా పట్టు భిగించింది. నాలుగవ రోజు తొలి సెషన్‌ లో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత జట్టును శ్రేయస్ అయ్యర్, వృద్దిమాన్ సాహ , రవిచంద్రన్ అశ్విన్‌ లు కాపాడి చక్కని టార్గెట్ సెట్ చేశారు. న్యూజీలాండ్ విజయానికి 284 పరుగులు చేయాలి. అయితే భారత జట్టు నాలుగో రోజు వరుసగా వికెట్లు పడేసుకున్నా.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన శ్రేయస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్‌లో సమయోచితంగా ఆడాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సాధ్యమైనంత సేపు క్రీజులో పాతుకొని పోయి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి రెండవ ఇన్నింగ్స్‌లో కీలకమైన 65 పరుగులు జోడించి అవుటయ్యాడు.

అయితే శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు ఏ టీమ్ ఇండియన్ క్రికెటర్ అందుకోని అరుదైన టెస్ట్ రికార్డును నమోదు చేశాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఒక సెంచరీతో పాటు మరో అర్ద సెంచరీ నమోదు చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు అరంగేట్రం టెస్టులో సెంచరీలు చేసిన ఇండియన్స్ 16 మంది ఉన్నారు. కానీ వాళ్లెవరూ మరో ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీ చేయలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లలో గతంలో 9 మంది మాత్రమే ఈ ఫీట్ సాధించగా.. శ్రేయస్ అయ్యర్ 10వ క్రికెటర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.

ఇక డెబ్యూ మ్యాచ్‌లలో రెండు అర్ద సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లు ఇద్దరే ఉన్నారు. 1933-34 సీజన్‌లో దిలావర్ హుస్సేన్ (59, 57) సాధించగా.. 1970-71 సీజన్‌లో భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ మీద అరంగేట్రం మ్యాచ్‌లో 65, 67 నాటౌట్ ఫీట్ సాధించాడు. అయితే వీరిద్దరి రికార్డును శ్రేయస్ అయ్యర్ సవరించాడు. ఇక అరంగేట్రం టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన టీమ్ ఇండియా బ్యాటర్లలో అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 170 పరుగులు చేశాడు.

హర్ష భోగ్లే 6 సంవత్సరాల క్రితం 2015లో యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ గురించి ట్వీట్ చేశారు. అప్పుడు అయ్యర్ భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అప్పుడే శ్రేయాస్ అయ్యర్ ఆటను చూసిన హర్షా భోగ్లే, 2015లో తన ట్వీట్టర్‎లో శ్రేయాస్ అయ్యర్ కెరీర్‌ ను నిశితంగా పరిశీలించబోతున్నట్లు రాశారు.హర్షా భోగ్లే నిన్న స్వయంగా శ్రేయాస్ అయ్యర్ గురించి 6 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌ను ఆయన ట్యాగ్ చేస్తూ చూడండి, ఏమి జరిగిందో అని రాసుకొచ్చారు. తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో అతను చాలా ఉన్నతంగా గర్తింపు పొందిన యువకుడు ఇప్పుడు భారతదేశం కోసం భవిష్యత్తులో చాలా మ్యాచ్‌ లు గెలవగల ఆటగాడిగా మారినందుకు భోగ్లే చాలా సంతోషంగా ఉన్నాడు.