Begin typing your search above and press return to search.

6 Top selling Telugu books of the month Oct 2014

By:  Tupaki Desk   |   12 Nov 2014 6:32 PM IST

1. జంధ్యామారుతం

తెలుగు సినిమా చరిత్రలో జంధ్యాలది ఒక అధ్యాయం. కామెడీకి కటౌట్ స్టేటస్ కల్పించిన దర్శకుడు జంధ్యాల. ఇప్పటి హీరోలు అలవోకగా కామెడీ చేస్తున్నారంటే అది జంధ్యాల వేసిన పునాదే. ఈ రోజుకూ యూట్యూబులో అత్యధికంగా చూడబటుతున్న సినిమాలు జంధ్యాలసినిమాలే అంటే అతిశయోక్తి కాదు. మొత్తం జంధ్యాల దర్శకత్వం వహించిన 39 సినిమాల సమగ్ర సమాచారం ఈ పుస్తకం - నంబర్ వన్ పుస్తకంగా ఉండటం ఆశ్చర్యం కాదు కదా!


2. లోయ నుంచి శిఖరానికి

తెలుగు వారి అభిమాన పాపులర్ రచయిత యండమూరి వీరంద్రనాథ్ తాజా పుస్తకం ఈ లోయ నుంచి శిఖరానికి. నేటి తరానికి కావాల్సిన మోటివేషన్ ఈ పుస్తకం. కెరీర్ లో అత్యున్నత శిఖరాలు ఎలా అందుకోవాలో చెప్పే ఈ పుస్తకం విడదలైనప్పటినుంచీ టాప్ పుస్తకాల్లో పదిలంగా ఉంది.


3. కృతయుగ్

సూర్యదేవర రామ్మోహనరావు, నూరుకు పైగా తెలుగు నవలలు రాసిన ఘనాపాఠి. సూర్యదేవర తాజా పుస్తకం ఈ కృతయుగ్. హిందూ మైథాలజీ, ఆధునిక టెక్నాలజీ అందంగా కలగలిపిన రొమాంటిక్ పుస్తకం ఈ కృతయుగ్.


4. నిశ్శబ్దనాదం

డైనమిక్ రైటర్ మధుబాబు తాజా సృష్టి ఈ అమోఘ థ్రిల్లింగ్ నవల నిశ్శబ్ద నాదం. విడుదలైనప్పటినుంచి నేటివరకూ టాప్ పుస్తకాల్లో పదిలంగా ఉన్న రికార్డు దీని స్వంతం. తనదైన పదునైన శైలిలో అత్యంత చదవబుల్ పుస్తకం ఈ నిశ్శబ్ద నాదం.


5. రామాయణ విషవృక్షం

రంగనాయకమ్మ రచించిన రామాయణ విషవృక్షం వర్మతో సహా ఎందరో ఆధునికులకు ఇష్టమైన పుస్తకం. రామాయణాన్ని తనదైన శైలిలో మార్కిజం దృష్టితో రచించిన ఈ పుస్తకం ఈ కాలపు ఓపెన్ మైండ్ పౌరులకు బైబిల్ వంటిది.


6. అరేబియన్ కామశాస్త్రం

మన వాత్సాయన కామశాస్త్రంలా అరేబియన్ వాళ్ల కామశాస్త్రం ఈ పుస్తకం. వందల సంవత్సరాల నాటి అరేబియన్ కామశాస్త్రంలో ఏముందంటూరు ఇంతకీ?


Press Release by: IndianClicks.com