Begin typing your search above and press return to search.

అయోధ్య పై సుప్రీం తీర్పు లో 6 కీలక పాయింట్స్

By:  Tupaki Desk   |   9 Nov 2019 7:08 AM GMT
అయోధ్య పై సుప్రీం తీర్పు లో  6 కీలక పాయింట్స్
X
వివాదాస్పద స్థలం గా మత అంశం గా మూడు దశాబ్దాల పాటు న్యాయస్థానాల్లో నలిగి పోయిన అయోధ్య - బాబ్రీ మసీదు కేసుకు నేడు తేరా పడింది. వివాదాస్పద స్థలం తమ దేనని ముస్లిం సంస్థలు నిరూపించు కోలేకపోయాయని ఐదుగురు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఏకాభిప్రాయం తో తీర్పు వెలువరించింది.ఆ స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించింది. దీంతో అయోధ్య లో రామ మందిరం నిర్మించాలన్న హిందువుల కల నెరవేరడానికి మార్గం సుగమం అయింది.

శనివారం ఉదయం 10.30గంటలకు సుప్రీం ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గొగొయ్ నేత్రుత్వం లోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్ర చూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌ల తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు కాపీలను చదవడం ప్రారంభించింది. తీర్పు పాఠాన్ని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ దాదాపు అరగంట పాటు చదివి వినిపించారు.

వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాల భూమి రామ జన్మభూమి న్యాస్‌ కే చెందుతుందని సుప్రీం స్పష్టం చేసింది.రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ముస్లింలకు మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు కు కేటాయించాలని సుప్రీం ఆదేశించింది.

1528లో బాబర్ ఆ మసీదును నిర్మించాడు. అయితే దాన్ని ఖాళీ స్థలం లో నిర్మించ లేదు. కట్టడం కింద మరో మతానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి అని సుప్రీం తెలిపింది.

వివాదాస్పద స్థలాన్ని రామ్‌లల్లా విరాజ్‌మన్,నిర్మోహి అఖారా,సున్నీ వక్ఫ్ బోర్డులకు పంచుతూ గతం లో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తప్పు పట్టింది.

పురావస్తు శాఖ నివేదిక లో అక్కడ మసీదు,ఈద్గా నిర్మాణాలు ఉన్నట్టు ఆధారా లేమి లేవు. 1885కి ముందు అక్కడ హిందువులు కూడా పూజలు చేసేవారు. రామ్‌ చతరబుత్రా, సీతార సోయ్ దగ్గర అక్కడ పూజలు జరిగేవి అని సుప్రీం తెలిపింది.