Begin typing your search above and press return to search.

ముంబైలో వదిలిన మాల్యా విమానం కథ..

By:  Tupaki Desk   |   12 Jun 2018 2:54 PM GMT
ముంబైలో వదిలిన మాల్యా విమానం కథ..
X
బ్యాంకులను ముంచి పారిపోయిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ విమానం ఇప్పుడు ముంబై విమానాశ్రయానికి గుదిబండగా మారింది. మాల్యా బిచాణా ఎత్తి వేసి విదేశాలకు పారిపోవడంతో ఆయన ఆస్తులన్నింటిని ప్రభుత్వం సీజ్ చేసింది. అందులో భాగంగానే 2013 డిసెంబర్ లో మాల్యాకు చెందిన అది పెద్దది అయిన కింగ్ ఫిషర్ విమానం ఎయిర్ బస్ ఏ319ని సేవా పన్ను విభాగం స్వాధీనం చేసుకుంది. విజయ్ మాల్యా 1000 కోట్ల విలువైన మొత్తాన్ని చెల్లించడంలో విఫలమయ్యాడని సంస్థ పేర్కొంది.

నిజానికి ఈ విమానం మాల్యాకు ఎంతో ఇష్టమైనది.. ఆయన విదేశాలకు పారిపోయినప్పుడు ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్ చేశాడు. సుమారు 90 మిలియన్ డాలర్ల ఈ విమానం ఐదేళ్లుగా విమాశాశ్రయంలోనే ఉంటోంది. ముంబై విమానాశ్రయంలో విమానం పార్కింగ్ ఖర్చు గంటకు రూ. 15వేలు అవుతోంది. ఇప్పుడు ఈ విమానం ఖర్చే రూ.10 కోట్లు అయ్యింది. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఇప్పుడు అద్దె కూడా చెల్లించడం లేదు. దీంతో ఉచితంగా ఉంటున్న ఈ విమానం నిర్వహణ ముంబై విమానాశ్రయానికి పెను భారంగా మారింది. దీన్ని అమ్మేందుకు కూడా వీలు లేకపోవడంతో కేసు తేలే వరకు ఈ విమానం తుప్పు పట్టి పోవడం ఖాయమని అంటున్నారు.

విలాసాలకు పెట్టింది పేరైనా మాల్యా ఈ విమానంలో సకల సదుపాయాలు కల్పించారు. కొద్దిరోజులుగా నడవకపోవడంతో దీని కండీషన్ ఇప్పుడు తప్పింది. మరికొన్ని రోజులు గడిస్తే ఇనుప సామానుకే వాడుతారు. ఈ నేపథ్యంలో ఎన్నో కోట్ల విలువైన మాల్యా విమానం ఇప్పుడు ముంబై విమానాశ్రయానికే గుదిబండగా మారి ఉత్సవ విగ్రహంలా పడి ఉంది.