Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లో 5 జీ చర్చ.. కేంద్రం మాటేంటి?

By:  Tupaki Desk   |   7 Feb 2022 1:30 AM GMT
పార్లమెంట్ లో 5 జీ చర్చ.. కేంద్రం మాటేంటి?
X
సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. రోజురోజుకు టెక్నాలజీ వృద్ధి చెందుతోంది. కళ్ల ముందే జనరేషన్లు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న 4జీ అంటేనే మహా అద్భుతం అనుకున్నారు జనాలు. అనతి కాలంలోనే మరో తరం వృద్ధి చెందింది. త్వరలో 5జీ సేవలు కూడా రాబోతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. టెలికాం దిగ్గజాలు ట్రయల్ రన్ నిర్వహించుకునేందుకు కేంద్రం అనుమతులు సైతం ఇచ్చింది.

దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంఎన్టీఎల్ కంపెనీలు 5 జీ సేవల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇకపోతే ట్రయల్స్ నిర్వహించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకా ఆయా కంపెనీలు ట్రయల్స్ వేగవంతం చేస్తున్నాయి. త్వరలో దేశంలో 5జీ సేవలు త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా కూడా ఐదో జనరేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.

త్వరలో 5జీ సేవలు దేశంలో ప్రారంభించనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిగింది. 5జీ సేవల ట్రయల్స్ కు అనుమతి ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. అయితే వీటి ప్రభావం విమాన సేవల పై పడుతుందా? అని పలువురు ఎంపీలు చర్చ లేవదీశారు. విమాన సర్వీసుల భద్రతపై వివరణ కోరారు. అయితే ఇందుకు సంబంధించిన ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయని కేంద్రం తెలిపింది. విమాన సేవలకు ఎటువంటి ఆటంకం ఉండదు అని పేర్కొంది. అంతే కాకుండా అంతర్జాతీయ టెలీ కమ్యూనికేషన్ తో పాటు 5జీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఎయిరోనాటికల్ కమ్యూనికేషన్స్ పై కూడా ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

అమెరికాలో 5 జీ సేవలు ప్రారంభించారు. కాగా దీనిపై విమానయాన సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికాకు వెళ్లే విమానాలు కూడా నిలిచిపోయాయి. అమెరికా ఏవియేషన్ సెక్టార్ 5జీ సేవల పై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వీటివల్ల ప్రమాదం ఉందని... విమాన రాకపోకలు నిలిపివేశాయి. ఇతర దేశాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే డిజిటల్ ఇండియాలో భాగంగా 5 జీ సేవలు త్వరలో మన దేశంలో అందుబాటులోకి వస్తాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈ సేవలతో టెక్నాలజీలో పెను మార్పులు వస్తాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. దైనందిన జీవితంలోనూ ఊహించని మార్పులు జరుగుతాయని చెబుతున్నారు.