Begin typing your search above and press return to search.
టికెట్ తగ్గింపు షాక్: ఏపీలో 55 థియేటర్లు స్వచ్ఛందంగా తాళాలు
By: Tupaki Desk | 24 Dec 2021 9:51 AM ISTఒక కప్పు టీ రూ.10. కొన్ని చోట్ల రూ.12 నుంచి రూ.15 వరకు ఉంటోంది. అలాంటిది మూడు గంటల పాటు వేసే సినిమా టికెట్ ధర ఎంత ఉండాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సినిమా అన్నది వ్యాపారం. దాన్ని వ్యాపారంగానే చూడాలే తప్పించి.. అదేదో సేవా కార్యక్రమంగా చూడటం తప్పు. అయితే.. తాను అనుకున్నదే జరగాలనే పట్టుదల ఉన్న జగన్ సర్కారుకు.. సినిమా టికెట్ల ధరల విషయంలో తన మాటే నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. జనాల కోసం టికెట్ల ధరల్ని తగ్గించినట్లుగా వాదిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో సినిమా టికెట్ ధర కనిష్ఠంగా రూ.10లకే అమ్మాలని డిసైడ్ చేయటంతో థియేటర్ యజమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ప్రభుత్వం చెప్పిన ధరలకు టికెట్లను అమ్మితే.. లాభాల సంగతి తర్వాత.. ఒక సినిమా వేయటానికి అయ్యే కరెంటు ఖర్చు కూడా రాని పరిస్థితి. ఈ విషయాన్ని ఎంతలా చెప్పినా అధికారుల చెవికి ఎక్కకపోవటం.. మాకెన్ని చెప్పినా వేస్టే.. ప్రభుత్వానికి ఈ విషయాలు తెలీవా? మమ్మల్ని మా పనులు చేయనివ్వండంటూ చర్యలకు పాల్పడుతున్న అధికారుల తీరుకు థియేటర్ యజమానులు విసిగిపోయారు. అందుకే.. అధికారులు చర్యలు తీసుకోవటం ఏమిటి? మాకు మేమే థియేటర్లను మూసేస్తామంటూ.. ఏపీలోని థియేటర్ యజమానులు ఒకరి తర్వాత ఒకరు చొప్పున సినిమా థియేటర్లను మూసేస్తున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది.
గురువారం ఒక్కరోజులోనే ఏపీ వ్యాప్తంగా 55 థియేటర్లను వాటి యజమానులు స్వచ్చందంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మూతపడిన థియేటర్లలో అత్యధిక శాతం గ్రామ పంచాయితీల పరిధిలో నడిచే థియేటర్లే ఉన్నాయి. కొవిడ్ దెబ్బకు ఇప్పటికే థియేటర్ యజమానులు కిందా మీదా పడుతున్నారు. ఇలాంటివేళ.. ఏపీ సర్కారు టికెట్ల ధరల్ని తగ్గించేయటం.. తనిఖీల పేరుతో పెడుతున్న పరీక్షలకు తాము తట్టుకోలేమంటూ థియేటర్ యజమానులు థియేటర్లను మూసేస్తున్నారు.
తమకు తాముగా థియేటర్లకు తాళాలు వేసుకున్న ఉదంతంలో అత్యధికం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడి 45 థియేటర్లను వాటి యజమానులు మూసేశారు. అనంతపురం జిల్లాలోని పెనుకొండ.. క్రిష్ణా జిల్లాలోని నందిగామ.. మైలవరం.. పెనుగంచిప్రోలు.. శ్రీకాకుళం జిల్లా కొత్తూర్లలో థియేటర్లను వాటి యజమానులే తాళాలు వేసుకున్నారు.
ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన టికెట్ల తగ్గింపు ధరలు అమలు అవుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని తనిఖీలు చేసే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి మొదలు పెట్టారు.ఈ క్రమంలో అధికారుల తీరుతో విసిగిపోయిన థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా థియేటర్లను మూసేస్తున్నారు. సినిమా పరిశ్రమకు పండుగలే భారీ సీజన్. తెలుగు సినిమా విషయానికి వస్తే..క్రిస్మస్ మొదలు సంక్రాంతి వరకు భారీ సీజన్ గా చెబుతారు.
వరుస సెలవులతో పాటు.. వినోదం కోసం థియేటర్ కు రావటం ఏపీ ప్రజల జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. అలాంటిది.. సినిమా టికెట్ల ధరల్ని భారీగా తగ్గించేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. వాటిని అమలు చేస్తే.. థియేటర్ కరెంటు బిల్లుకు సరిపడా ఆదాయం వచ్చే అవకాశం లేకపోవటంతో..థియేటర్లను మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 35 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో టికెట్ల ధరలు రూ.10.. 15.. చ20 చొప్పున ఉండాలని.. నాన్ ఏసీ థియేటర్లలో రూ.5.. రూ.10.. రూ.15గా డిసైడ చేశారు. మున్సిపాలిటీల్లో రూ.30.. రూ.50.. రూ.70గా ఉంటే..కార్పొరేషన్ పరిధిలో రూ.40..రూ.60.. రూ.100చొప్పున టికెట్లను అమ్మాలి. ఇదిలా ఉంటే.. ఒక థియేటర్ ను ఒక నెల రోజులు నిర్వహించాలంటే అందుకు అయ్యే ఖర్చు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు అవుతుంది.
తాజాగా తగ్గించిన ధరలతో సినిమాను ప్రదర్శిస్తే.. కరెంటు బిల్లు మందంగా కూడా ఆదాయం రాని పరిస్థితి. అదే జరిగితే.. సినిమా నిర్వహణకు అయ్యే ఖర్చు.. సిబ్బంది జీతాలు.. థియేటర్ అద్దె లాంటివి కలుపుకుంటే తడిపి మోపెడు అవుతుంది. ఇన్ని బాధల కంటే కూడా థియేటర్లు మూసుకోవటం మంచిదన్న ఉద్దేశంతో యజమానులు మూసేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న థియేటర్ల రంగం.. తాజాగా ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు తప్పట్లేదు. తాజా చర్యలతో థియేటర్ల ఉనికికే ప్రమాదంగా మారిన పరిస్థితి.