Begin typing your search above and press return to search.
కాబూల్ విమానాశ్రయంలో 5వేలకు పైగా అమెరికా సైనికులు..ఎందుకంటే
By: Tupaki Desk | 20 Aug 2021 2:00 PM ISTఇస్లామిక్ దేశమైన ఆఫ్ఘనిస్తాన్, ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. అమెరికా సైన్యం అలా వెనక్కి తగ్గిందో లేదో , తాలిబన్లు దేశంలో విరుచుకుపడి కేవలం రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘన్ ను తమ గుప్పిట లోకి తెచ్చుకున్నారు. అయితే ఆఫ్ఘన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటికీ , కాబుల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాలిబన్ల అరాచకత్వానికి, ఆటవిక పరిపాలనకు భయపడి, దేశం విడిచి వెళ్లిపోవడానికి ఆఫ్ఘనిస్తానీయుల అందుబాటులో ఉన్న ఏకైక సాధనం, విమానాలు మాత్రమే కావడంతో వేలాదిమంది ఇప్పటికీ ఎయిర్ పోర్ట్ లో గడుపుతున్నారు.
అక్కడినుండే విమానాల్లో ఎక్కి, దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలను సాగిస్తోన్నారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికీ సురక్షితంగానే ఉందని అమెరికా గురువారం ప్రకటించింది. అమెరికా ఆర్మీ మేజర్ జనరల్ విలియం హాంక్ టేలర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు 5,200 మంది అమెరికా ఆర్మీ జవాన్లు అక్కడ కాపలా కాస్తున్నారని, ఆ ప్రాంతం నుంచి విమానాలు ఎగిరేందుకు అనుకూలంగానే ఉందని చెప్పారు. కాగా, ఆగస్టు 14 నుంచి ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. వారికి ఈ విమానాశ్రయం నుంచే తరలిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 7వేల మందిని తరలించినట్లు హాంక్ వెల్లడించారు. అమెరికన్ల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతి ఒక్క అమెరికన్ ను కూడా స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
విమానాశ్రయానికి వెళ్లే మార్గాలన్నింటినీ ఇప్పటికే మూసివేశారు తాలిబన్లు. ఆయా మార్గాల్లో వందలాది మంది తాలిబన్ ఫైటర్లు తుపాకులతో పహారా కాస్తోన్నారు. స్థానికులను అటువైపు వెళ్లనివ్వట్లేదు. విదేశీయుల తరలింపు ప్రక్రియను అడ్డుకుంటోన్నారు. విమానాల రాకపోకలు సజావుగా సాగనివ్వట్లేదు. ఇందులో భాగంగా ఇదివరకే కమర్షియల్ ఫ్లైట్ల రాకను నిషేధించారు. ఎయిర్ స్పేస్ ను మూసివేశారు. మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మిలటరీ విమానాలకు అనుమతి ఉండటం వల్ల విదేశీయుల తరలింపు ప్రక్రియ ఇంకా కాబుల్ ఎయిర్ పోర్ట్ నుంచి కొనసాగుతోంది. ఇందులో మెజారిటీ వాటా అమెరికాదే. ప్రస్తుతానికి హమీద్ కర్జాయ్ విమానాశ్రయం ఒక్కటే సురక్షిత ప్రదేశం కావడం వల్ల, అడ్డంకులను దాటుకుని ఆప్ఘనిస్తానీయులు అక్కడికి పరుగులు తీస్తోన్నారు. కనిపించిన విమానాన్ని అందుకుని దేశం దాటి వెళ్లడానికి తాపత్రయ పడుతున్నారు