Begin typing your search above and press return to search.

డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్ల దాడి... !

By:  Tupaki Desk   |   21 May 2020 6:15 AM GMT
డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్ల దాడి... !
X
పోలీసు శాఖ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని ఓ సంఘటన పశ్చిమ బెంగాల్‌ లో చోటుచేసుకుంది. డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్లు దాడి చేసి సంచలనం సృష్టించారు. ఇప్పటికే లాక్ డౌన్ డ్యూటీలతో పోలీసులు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. ఎంత పోలీసులైన రెస్ట్ లేకుండా పనిచేస్తే కొన్ని రోజుల తరువాత తెలియకుండానే అసహనం పెరుగుతుంది. ఏదొక సమయంలో అది బయటపడుతుంది. అక్కడ కూడా అదే జరిగింది. అప్పటికే లాక్ డౌన్ డ్యూటీ చేస్తున్న 500 మంది కానిస్టేబుళ్లను బెంగాల్ లో అంఫన్ తుఫాన్ ప్రాంతంలో ఆన్ డ్యూటీ వేశారు.

అయితే, వాళ్లు బ్యారక్‌లోనే ఉంటున్న ఓ ఎస్సైకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయినా.. శానిటైజేషన్ చేయడంలో ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో కానిస్టేబుళ్లు డీసీపీ నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో డీసీపీ పాల్ బయటకు వచ్చి వారిని శాంతించే ప్రయత్నం చేశారు. చర్చలు జరుగుతుండగానే.. సమూహంలోని కానిస్టేబుళ్లు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేస్తున్నా సరిపడా మాస్కులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు.

దీనితో ప్రాణ భయంతో ఆ డీసీపీ పరుగులు తీయాల్సి వచ్చింది.. అచ్చం సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి నిజంగానే పశ్చిమ బెంగాల్‌ లో చోటుచేసుకుంది. ప్రాణభయంతో డీసీపీ పరుగెత్తగా అలర్ట్ అయిన ఇతర పోలీసులు డీసీపీని రక్షించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో యావత్తు దేశం షాక్‌కు గురైంది. పోలీస్ శాఖ లో ఇంత పెద్ద దాడి ఇదే. కాగా, నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించి కానిస్టేబుళ్లతో చర్చించారు.