Begin typing your search above and press return to search.

50 శాతం మంది ప్రైవసీ పాలసీకి నో చెప్పేశారట

By:  Tupaki Desk   |   13 Jan 2021 9:08 AM IST
50 శాతం మంది ప్రైవసీ పాలసీకి నో చెప్పేశారట
X
చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో డేటా ఎంత ముఖ్యమో.. అంతకు మించి అన్నట్లుగా మారింది వాట్సాప్ వ్యవహారం. ఫోన్ కొన్న వెంటనే తొలుత అప్డేట్ చేసే యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్. అంతలా మన జీవితాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఈ యాప్ యజామాన్యం ఫేస్ బుక్ ఇప్పుడు సరికొత్త ప్రైవసీ పాలసీ అంటూ తెర మీదకు తీసుకురావటం.. దీనిపై భారీ ఎత్తున లొల్లి సాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం లేచినంతనే వాట్సాప్ లో ఎవరైనా మెసేజ్ లు పెట్టారా? అన్న విషయాన్ని చెక్ చేసినంతనే.. ప్రైవసీ పాలసీ పేరుతో.. మేం తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని ఒకే చెబుతారా? లేదంటే ఫిబ్రవరి 8 నుంచి మా సర్వీసుల్ని బంద్ చేస్తామంటూ ఈ మధ్య అందరికి మెసేజ్ రావట తెలిసిందే.

కొంతమంది.. ఆ ఏముంది.. అడిగింది మన వాట్సాప్ నే కదా అంటూ ఓకే చెప్పేస్తే.. చాలామంది మాత్రం తర్వాత అంటూ నొక్కేస్తున్నారు. చూస్తుండగానే ఈ ఇష్యూ మీద పెద్ద రచ్చే సాగుతోంది. వాట్సాప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత అలవాటు పడితే మాత్రం.. మా బలహీనతను ఆధారంగా చేసుకొని ఇంత పని చేస్తావా? అంటూ వాట్సాప్ మీద విరుచుకుపడుతున్న వారు లేకపోలేదు.

ఇలాంటి వేళ.. వాట్సాప్ నయా పాలసీ మీద ఇంగ్లీష్ న్యూస్ యాప్ ఇన్ షార్ట్స్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారిలో 47 శాతం మంది కొత్త ప్రైవసీ పాలసీని లైట్ తీసుకుంటామని.. తాము అంగీకరించమని తేల్చేశారు. దేశంలోని ప్రతి ఇద్దరు వాట్సాప్ వినియోగదారుల్లో ఒకరు కొత్త ప్రైవసీ పాలసీకి నో అంటే నో చెప్పేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న 14 శాతం మంది మాత్రం తమకు ఇవేమీ పట్టవని.. వాట్సాప్ అడిగిన పాలసీకి ఓకే చెప్పేశారు. ఇక.. సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మందికి తమకు ప్రత్యామ్నాయం గురించి తెలియకనే తాము వాట్సాప్ లో కంటిన్యూ అవుతున్నట్లు పేర్కొన్నారు.

సర్వేలో దాదాపు 1.8 లక్షల మంది

ఇక్కడితో ఈ విషయం ఆగలేదు. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్ లు ఏమిటన్న వెతుకులాట మొదలైంది. ఇప్పటికే పలువురు టెలిగ్రామ్.. సిగ్నల్ వాటి గురించి తెలుసుకొని డౌన్ లోడ్లు చేసుకుంటున్నారు. చాలామంది ఈ రెండు యాప్ లను వాడటం షురూ చేశారు. మొదట్నించి అలవాటై.. ఇప్పుడు అది లేకుంటే చేతులు.. కాళ్లు ఆడని వారు మాత్రం వాట్సాప్ పెడుతున్న రూల్స్ ను లైట్ తీసుకొని ఓకే చెప్పేస్తున్న వారు లేకపోలేదు. మొత్తంగా వాట్సాప్ ప్రైవసీ వ్యవహారం మరెంత వరకు వెళుతుందో చూడాలి.