Begin typing your search above and press return to search.
అకస్మాత్తుగా నిల్చున్న చోటే నిటారు గొయ్యి..కారణాలు ఇవే
By: Tupaki Desk | 5 Sept 2020 9:00 AM ISTరోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ముందు, వెనకాల వస్తున్న వాహనాలను చూసుకోవడంతో పాటు ఇప్పుడు మరో పని కూడా చేయాల్సి వస్తోంది. అదే రోడ్డుపైగోతులుచూడటం..ఇదేంటీ కొత్తగా గోతులు చూసే కదా డ్రైవింగ్ చేసేది అనుకునేరు. ఇవి ఆ గుంతలు కాదు. ఇప్పుడు రోడ్లు, మైదానాలు చాలా ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ 50 నుంచి 100 మీటర్ల గొయ్యిలు ఏర్పడుతుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు ఆందోళన చెందుతున్నారు. అప్పటి వరకు సమతలంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్టుండి పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడుతుండటం ఇప్పుడు కామన్ గా మారింది. అయితే మీథేన్ వాయువు కారణంగానే ఇలా గొయ్యిలు, అగాథాలు ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పట్టణాల్లో పెద్ద పెద్ద రోడ్లపై అకస్మాత్తుగా పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడుతుంటాయి. అయితే వాటికి కారణాలు వేరే. బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరగడం, భూగర్భ డ్రైనేజీ కోసం లోతైన తవ్వకాలు చేపట్టినప్పుడు భూమి లోపల వత్తిడి పెరిగి అకస్మాత్తుగా భూమి కుంగి పోతుంటుంది. అలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి.
తాజాగా సెర్బియా ప్రాంతంలోని యామల్ పెనిన్సులా ప్రాంతంలో ఉన్నట్టుండి భూమిపై 50 మీటర్ల పెద్ద గొయ్యి ఏర్పడింది. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా భూమి లోని మీథేన్ వాయువు కారణంగా ఇలా గొయ్యిలు ఏర్పడుతుంటాయని గుర్తించారు. గత ఏడాది ఏపీ లోని కడప, కర్నూలు జిల్లాలో ఇలాగే అకస్మాత్తుగా గొయ్యిలు ఏర్పడడంతో జనం ఏం జరిగిందో అర్థం కాక ఆందోళన చెందారు. ఏది ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉండాలని..లేకపోతే గొయ్యి ఏర్పడే చోట ఉంటే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.