Begin typing your search above and press return to search.
భారత్‌లో 5వేల కొత్త స్ట్రెయిన్లు.. !
By: Tupaki Desk | 20 Feb 2021 1:00 PM ISTకరోనా వైరస్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల కరోనా ‘కొత్త స్ట్రెయిన్’ ఆందోళన కలిగిస్తున్నది. బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత ఇది ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాపించింది. అయితే భారత్‌లో కూడా కొత్తస్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పడు బ్రెజిల్, జపాన్, దక్షిణాఫ్రికాల్లోనూ మరికొన్ని కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చినట్టు డాక్టర్లు అంటున్నారు. ఇదిలా ఉంటే సీసీఎంబీ ( సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ) ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టింది. అదేమింటంటే .. ఒక్క మనదేశంలోనే దాదాపు 5 వేల కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్లు ఉన్నాయట. ప్రతి వైరస్ పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే దాని జన్యుక్రమాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దీన్నే కొత్త స్ట్రెయిన్ వైరస్ అంటారు.
కరోనా కూడా తన రూపాన్ని మార్చుకున్నది. భారత్‌లో ఇప్పటివరకు దాదాపు 5 వేల కొత్త స్ట్రెయిన్లు గుర్తించినట్టు సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు.సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రచురించిన పరిశోధనా వ్యాసంలో ఈ విషయం బయటపెట్టారు. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో 5 వేల రూపాంతంరం చెందిన కరోనా స్ట్రెయిన్లు గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిల్లో వేగంగా వ్యాప్తి చెందగల ఎన్–501–వై, నాశనం చేసేందుకు ఎక్కువ యాంటీబాడీలు అవసరమయ్యే ఈ–484–కేలు కూడా ఉన్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.
ఎన్–440–కే రకం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఏడాదిలోనే భారత్‌లో అన్ని రకాల రూపాంతరాలు ఎలా పరిణామం చెందాయన్న అంశాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వివరించారు. గతేడాది జూన్ నాటికి దేశంలో కొంచెం నెమ్మదిగా వ్యాప్తి చెందుతుందనుకున్న ‘ఏ3ఐ’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువచోట్ల ఉన్న ‘ఏ2ఏ’ రూపాంతరం వచ్చేసింది.